మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ''ఉప్పెన''. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 'ప్రేమలో మునిగి తేలండి' అంటూ 'ఉప్పెన' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'ఉప్పెన' టీజర్ లో 'దేవుడే వరాలిస్తాడాని నాకు అర్థం అయింది.. ఎవరికి పుట్టామో మనకు తెలుస్తుంది.. ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది' అని హీరో చెప్పడం ద్వారా చిన్నప్పుటి నుంచే అతను హీరోయిన్ ని ఇష్టపడుతుంటాడాని అర్థం అవుతోంది. 'లవ్ యూ ఐ' అని రాసిన కృతి.. మన మధ్య లవ్ ఎందుకులే అని పక్కకకి జరిపేశాను అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బ్రతికేద్దాం' అని హీరోయిన్ చెప్పడం.. చివర్లో హీరో సముద్రపు ఒడ్డున పడి ఉండటం చూస్తుంటే ఇదొక విషాదాంత ప్రేమ కథ అనే డౌట్ కలిగిస్తోంది. దీనికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. వైష్ణవ్ - కృతి ఇద్దరూ ఫస్ట్ సినిమా అయినప్పటికీ మంచి నటన కనబరిచినట్లు తెలుస్తోంది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. కరోనా కారణంగా వాయిదా పడిన 'ఉప్పెన' చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Full View