వీడియో: పిచ్చి పీక్స్ అంటే ఇదే భ‌య్యా

Update: 2022-11-19 02:30 GMT
ఫ్యాష‌న్ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుకుంటే ఎలా ఉంటుందో మోడ‌ల్ కం న‌టి ఉర్ఫీని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ట్రెండ్ ని అనుకరించ‌డంలో .. నిరంత‌ర ప్ర‌యోగాలతో టూమ‌చ్ గా హ‌ద్దుమీరడంలో ఈ భామ డేర్ ని మెచ్చుకుని తీరాలి. రొటీనిటీని అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని ఉర్ఫీ ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేస్తోంది. వీటిపై యువ‌త‌రం కామెంట్ల‌తో జోరుగా చెల‌రేగుతుంటే ఇది ఒక ప‌సందైన‌ జూదంలా మారింది.

ఉర్ఫీ ఏం చేస్తున్నా కుర్ర‌కారు క‌ళ్ల‌న్నీ త‌న‌వైపే. టాప్ మోడ‌ల్స్ ని త‌ల‌ద‌న్నే ప్ర‌యోగాలు చేస్తూ డిజైన‌ర్ గా త‌న‌లోని క్రియేటివిటీని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తోంది. అయితే ఇది చాలామంది సాంప్ర‌దాయ వాదుల‌కు అస్స‌లు న‌చ్చ‌క‌పోయినా మాస్ కి మాత్రం ఫుల్ కిక్కిస్తోంది. ఫ్యాష‌న్ పోక‌డ‌ల ప‌రంగా ఉర్ఫీలో పిచ్చి పీక్స్ కి చేరుకుంది! అన్న కామెంట్లు చేస్తున్నా... నేటిత‌రంలో ఉర్ఫీ లా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఎక్స్ పెరిమెంట్స్ కి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కుతోంది. ఇలా చేయ‌గ‌లిగే వేరొక న‌టి లేరు! అన్న ప్ర‌శంస‌లు మ‌రోవైపు ద‌క్కుతున్నాయి.

ఏది ఏమైనా ఉర్ఫీ ఏం చేస్తున్నా షో స్టాప‌ర్ గా నిలుస్తోంది. ప్ర‌పంచం క‌ళ్ల‌న్నీ త‌న‌వైపే ఉండేలా చేయ‌డంలో విఫ‌లం కావ‌డం లేదు. నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో త‌న‌ని ఎలా నిల‌పాలో ఉర్ఫీని చూసి ఇత‌ర భామ‌లు టాప్ మోడ‌ల్స్ నేర్చుకోవాల్సిందే.

తాజాగా ఉర్ఫీ జావేద్ ఫ్యాష‌న్ సెన్స్.. ఎక్స్ పెరిమెంట‌ల్ యాటిట్యూడ్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది. కేవలం రెండు సెల్ ఫోన్ లతో తయారు చేసిన టాప్ ను ఎద అందాల‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు ధ‌రించి సాహ‌సం చేసింది ఈ బ్యూటీ. ఈ వీడియోని ఇలా షేర్ చేయ‌గానే అలా ఇంటర్నెట్ లో తుఫాన్ గా మారింది. బోల్డ్ బ్యూటీ వింతైన‌ ఫ్యాషన్ అనుక‌ర‌ణ మ‌రోసారి యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. అలా అర‌విరిసిన అందాల‌ను క‌వ‌ర‌ప్ చేస్తూ బ్లూ బ్లేజర్ ని ధ‌రిస్తున్న ఉర్ఫీ అదిరే ట్విస్ట్ తో స్టైల్ గా మూవ్ అయిన తీరు  అభిమానులను ఊహాలోకంలోకి తీసుకెళ్లింది.

ఈ లేటెస్ట్ ఫ్యాష‌న్ ఎంపిక‌పైనా మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ వీడియోను షేర్ చేసి ``ఫుల్లీ ఛార్జ్ డ్`` అంటూ చిలిపి వ్యాఖ్య‌ను జోడించింది. త‌న టాప్ ను కేవ‌లం రెండు సెల్‌ఫోన్ లతో క‌వ‌ర్ చేయాల‌న్న ఆలోచ‌న‌... దానిపై బ్లూ బ్లేజ‌ర్ తో జ‌త చేయాల‌న్న క్రియేటివిటీపై కుర్ర‌కారు అదే ప‌నిగా చ‌ర్చించుకుంటున్నారు.

ఈ వీడియోపై ఫ్యాన్స్ ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. ద్వేషం ప్ర‌ద‌ర్శించిన వారు కొంద‌రుంటే త‌న‌కు మద్దతు ప‌లికిన వారు లేక‌పోలేదు. ``ఇలాంటి చెత్త‌ వేషాలు వేస్తే ఆమెను బ్యాన్ చేయాలి.. ఇతరుల ముందు ఇది స‌మ్మ‌త‌మా?`` అంటూ ఒక నెటిజ‌నుడు నిల‌దీసాడు. ``ఈ సమయంలో నేను ఈ అమ్మాయితో.. కోయి ఇస్కా ఖాతా బ్యాండ్ కర్వావో యార్`` అని వేరొక నెటిజ‌నుడు రాసాడు.

ఉర్ఫీ ఇప్ప‌టికే చాలా ర‌కాల మెటీరియ‌ల్స్ తో డ్రెస్ డిజైన్ ప‌రంగా ప్ర‌యోగాలు చేసింది.  సేఫ్టీ పిన్స్... రేజర్లు... గ్లాసెస్ .. చండీ వర్క్ .. కాటన్.. మిఠాయి (ఆహార పదార్థం)లతో తయారు చేసిన అనేక దుస్తులను ధరించింది. ప్ర‌తిసారీ విమ‌ర్శ‌లు మాత్రమే కాదు ప్రశంసలు కూడా ద‌క్కుతున్నాయి.

హాలీవుడ్ స్టార్ టేలర్ స్విఫ్ట్ బ్లాక్ క‌ల‌ర్ లో ఈ త‌ర‌హా దుస్తులు ధరించడంతో ఆ అందం మెరుపుల‌కు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు దానికి అనుక‌ర‌ణ‌గా ఉర్ఫీ త‌న‌లోని క్రియేటివిటీని యాడ‌ప్ చేసింది.

ప్ర‌స్తుతం ఉర్ఫీ జావేద్  డేటింగ్ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా X4లో రంగ ప్ర‌వేశం చేస్తోందంటూ మీడియా హెడ్ లైన్స్ వేడెక్కిస్తున్నాయి. ఈ వారాంతంలో షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. టీవీ షోలో ఉర్ఫీని చూడటానికి అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇదేగాక‌.. పాప్ ఆల్బ‌మ్ ``హాయే హయే యే మజ్బూరి``లో ఉర్ఫీ కనిపించింది. ఇది బాలీవుడ్ క్లాసిక్ ఐకానిక్ పాటకు రీమేక్. పాట‌లో ఉర్ఫీ అందాలు ఆర‌బోసింది. యూట్యూబ‌ర్ గా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా ఉర్ఫీ కి అసాధార‌ణ క్రేజ్ పెర‌గ‌డానికి కార‌ణం త‌న‌లోని ఈ ప్ర‌యోగాత్మ‌క‌త అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ భామ సౌత్ లో ప్ర‌వేశించేందుకు ఆస‌క్తిగా ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క‌న్ను ఈ భామ‌పై ప‌డిన‌ట్టు లేదు!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News