పెద్ద తెరపై మిస్సయితే చూసి తీరాల్సిన రెండు సినిమాలు.. త్వరలో బుల్లితెరపై అందుబాటులోకి వస్తున్నాయి. కాన్సెప్ట్ .. కంటెంట్.. టేకింగ్ ఫెంటాస్టిక్..!! అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఆ రెండు సినిమాలు అస్సలు బోరింగ్ అన్నవే లేనివి. పరమ రొటీన్ ఫక్తు మసాలా సినిమాలకు భిన్నంగా అద్భుతమైన కాన్సెప్టుతో తెరకెక్కిన ఆ రెండు సినిమాల్ని జీ-సినిమాలు టెలీకాస్ట్ చేస్తోంది.
విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించిన యూరి .. రణవీర్ సింగ్ - ఆలియా భట్ జంటగా నటించిన గల్లీబోయ్ చిత్రాల్ని జీ చానెల్ లో ప్రీమియర్లు వేస్తున్నారు. ఈనెల 5న (గురువారం) యూరి .. ఇదే నెల 22న గల్లీబోయ్ చిత్రాల్ని జీ సినిమాలు హెచ్ డీలో వీక్షించే సౌలభ్యం ఉంది. టీవీ ప్రీమియర్లకు సంబంధించిన ప్రమోలు ఇప్పటికే టీవీ తెరపై సందడి చేస్తున్నాయి.
`యూరి` చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ఇండో పాక్ భూభాగంలో అత్యంత ప్రమాదకరమైన యూరి ఏరియాలో తీవ్రవాదులపై భారత ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆపరేషన్ బెటాలియన్ ని నడిపించే ఆర్మీ మేన్ పాత్రలో విక్కీ అద్భుతంగా నటిస్తే.. యామీ గౌతమ్ డిపార్ట్ మెంట్ నర్స్ గా కనిపిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్ ప్లేతో డెబ్యూ దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద 250 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సాధించిన విజయం స్ఫూర్తితోనే ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్స్ 2పైనా మూడు నాలుగు సినిమాల్ని తీస్తున్నారు. ఇక యూరి లో మిలటరీ ఆపరేషన్ ని కళ్లకు కట్టినట్టు చూపించిన తీరును ప్రశంసించాల్సిందే. ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ - ఆలియా భట్ జంటగా ర్యాపర్ కం డ్యాన్సర్ల కాన్సెప్టుతో వచ్చిన గల్లీబోయ్ అంతే సంచలనాలు సృష్టించింది. ఒక మామూలు స్లమ్ నుంచి వచ్చిన ర్యాపర్ ప్రతిభతో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు అన్న సందేశాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా ఎలివేట్ చేస్తూ జోయా అక్తర్ తెరకెక్కించిన స్ట్రాంగ్ కంటెంట్ మూవీ ఇది అంటూ విమర్శకులు ప్రశంసలు జల్లు కురిపించారు. యూరి.. గల్లీబోయ్ రెండు చిత్రాలకు 4/5 రేటింగులతో క్రిటిక్స్ ప్రశంసలు గుప్పించారు. అంత మ్యాటర్ ఉన్న సినిమాలు కాబట్టి బుల్లితెరపైనా టీఆర్ పీని కొల్లగొడతాయని అభిమానులు భావిస్తున్నారు.