కంగనా రౌనత్ తనే బాధితురాలు అన్నట్టుగా డ్రామాలు ఆడుతోందని కాంగ్రెస్ నాయకురాలు , రంగీలా ఫేమ్ ఉర్మిలా మటోండ్కర్ మండిపడ్డారు. ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా.. తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ డ్రగ్స్ కు మూలం అన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.
బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా అంటూ విరుచుకుపడుతున్న కంగనా మొదట తన పోరాటాన్ని సొంత రాష్ట్రం నుంచే ప్రారంభించాలని ఉర్మిల తెలిపారు. పెద్దగా నోరుతో మాట్లాడితే నిజాలు అయిపోవని ఫైర్ అయ్యారు.
ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులతో వైప్లస్ క్యాటగిరి అనుభవిస్తున్న కంగన డ్రగ్స్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ప్రశ్నించారు.
ముంబైని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కించపరిచేలా మాట్లాడితే తను సహించబోనని ఉర్మిల హెచ్చరించారు. కంగన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయని దుయ్యబట్టారు. అవి విఫలమైతే మహిళా హక్కులు అంటూ విమెన్ కార్డు ఉపయోగిస్తారు అంటూ కంగన గురించి వ్యాఖ్యలు చేసింది.