బోనీ - ఊర్వశి హాట్ ఫైట్.. కందకు లేని దురద కత్తికెందుకు?

Update: 2019-04-02 17:56 GMT
బోనీ కపూర్- ఊర్వశి రౌటెల్లా హాట్ వీడియో వ్యవహారం వెబ్ లో వైరల్ గా మారింది. ఒక ప్రొడ్యూసర్ వాళ్లింట్లో పెళ్లి రిసెప్షన్ ఉంటే అక్కడకు బాలీవుడ్ వాళ్లంతా వచ్చారు. అలా వచ్చిన ఊర్వశి రౌటెల్లా అక్కడ ప్రెస్ వాళ్లకు పోజులు ఇస్తూ ఉంది. సరిగ్గా ఆ సమయంలో అక్కడకు వచ్చిన బోనీ కపూర్ ఆమెను పలకరించాడు. వారిద్దరి మధ్యన ఏ సాన్నిహిత్యం ఉందో కానీ చొరవగా ప్రవర్తించాడు.

ఆమె పిరుదుల మీద చేతులు కూడా వేశాడు బోనీ. ఆమెతో ఆయనకు అంత సాన్నిహిత్యం ఉందేమో కానీ.. ఆమె బ్యాక్ ను తడిమాడు - కొట్టాడు. అసలే అక్కడకు వచ్చే సెలబ్రిటీల కోసం వందల కెమెరాలు కాచుకుని ఉన్నాయి. ఈ వీడియో కూడా వాటిల్లో రికార్డు అయ్యింది. ఇంకేముంది.. వెబ్ లో అందుకు సంబంధించిన రచ్చ జరుగుతూ ఉంది.

అయితే ఈ ఇష్యూలో బోనీ కపూర్ ఇంకా స్పందిచంలేదు. ఇక ఊర్వశీ రౌటెల్లా మాత్రం, తనతో బోనీ కపూర్ ఏమీ అసభ్యంగా ప్రవర్తించలేదని, ఆయన తీరును తప్పు పట్టడానికి లేదని అంటోంది.  ఇదీ వ్యవహారం.
అసభ్యంగా తడిమాడు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న బోనీ స్పందిచడం లేదు. ఇక్కడ బాధితురాలు అనదగ్గ ఊర్వశీ ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తోంది!

అయితే జనాలు మాత్రం తగ్గట్లేదు. ఈ వ్యవహారంలో తమ జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ‘అదే ఎవరైనా అనామకుడు తడిమితే ఊర్వశి ఊరికే ఉండేదా?’ అని కొంతమంది ప్రశ్నించేస్తున్నారు. అయితే ఊరికే ఉంటుందా, గొడవ చేస్తుందా అనేది ఆమె ఇష్టం. ఎలా స్పందించడానికి ఆమెకు అన్ని హక్కులూ ఉంటాయి. అయినా కత్తికి లేని దురద కందగడ్డకు ఎందుకు అని ఒక సామెతను ఇక్కడ గుర్తు చేయకతప్పదు!
Tags:    

Similar News