పలాస 1978 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ డీన్ లు తలలు తిప్పి తనవైపు చూసేలా చేసిన ఉత్తరాంధ్ర ట్యాలెంటు అతడు. ప్రస్తుతం సుధీర్ బాబు కథానాయకుడిగా `శ్రీదేవి సోడా సెంటర్` అనే మాస్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోదారి నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే సుధీర్ బాబు లుక్ కి చక్కని స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత ఓ పూర్తి స్థాయి సిట్యువేషనల్ హ్యూమర్ అండ్ కామెడీ సినిమా తీస్తానని ఆయన అంటున్నారు. మొత్తం 8 కథలు రెడీ చేసుకుని వరుస సినిమాల చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు.
పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటికే రెండు చిత్రాలకు సంతకాలు చేశారని తెలిసింది. సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చిత్రీకరణ పూర్తవుతోంది. తదుపరి గీతా ఆర్ట్స్ లోనూ ఓ సినిమా చేయనున్నారు.
పలాస సంగతి ఇదీ:
రక్షిత్ - నక్షత్ర- రఘు కుంచె ప్రధాన పాత్రలలో నటించిన పలాస 1978 కథాంశం ఆసక్తికరం. ఈ మూవీలో అతడు శుభలేఖ సుధాకర్ కి తిరిగి ఆఫర్ ఇచ్చారు. ఆ కాలంలో పలాసాలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రమిది. తన చిత్రం ఇంకా థియేటర్లలోకి రాకముందే కరుణ తన రెండవ చిత్రానికి అల్లు అరవింద్ నుంచి అడ్వాన్స్ అందుకోవడం ఆసక్తికరం. అప్పట్లో పలాస 1978 స్పెషల్ స్క్రీనింగ్ చూసిన అరవింద్ ఎంతగానో ఎగ్జయిట్ అయ్యారు. వెంటనే గీతా ఆర్ట్స్ లో ఆఫర్ ఇచ్చారు. దర్శకుడు కరుణకుమార్ కు అడ్వాన్స్ కూడా అందింది.
అనేక బ్లాక్ బస్టర్స్ కొన్ని ఫ్లాప్ చిత్రాలకు ఘోస్ట్ గా కథలు రాసిన కరుణ కుమార్.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రంతో రచయితగా తన మొదటి క్రెడిట్ పొందారు. కొన్నేళ్లుగా మహిళా సాధికారతపై అనేక నాటకాలు కథలు రాశారు. స్వఛ్ భారత్ అభియాన్ కోసం 2016 లో నిర్వహించిన పోటీలో అతని లఘు చిత్రం `చెంబు` రెండవ బహుమతిని గెలుచుకుంది.