వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రం `చోర్ బజార్`. గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది. `దళం`, జార్జిరెడ్డి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఐ.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ పై వీ.ఎస్. రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి స్టార్ ప్రొడక్షన్ కంపనీ యువీ క్రియేషన్స్ యాడయింది. చిన్న సినిమా కావడం, కంటెంట్ బాగుండటంతో తమ వంతు సహాయాన్ని అందించడానికి రెడీ అయిపోయింది.
హైదరాబాద్ లోని చోర్ బజార్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అక్కడ ఒక షూ మిస్సయితే అక్కడ సేమ్ షూ లభిస్తుంది.. చెప్పు నుంచి భారీ విలువ చేసే ఏ వస్తువు పోయినా అక్కడ దొరకాల్సిందే. అందుకే దీనికి చోర్ బజార్ అని పేరు పడిపోయింది. ఈ నేపథ్యంలో సాగు కథగా ఆకాశ్ పూరి `చోర్ బజార్`ని దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. సినిమాలో చోర్ గా ఆకాష్ పూరి కనిపించబోతున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ మూవీ ద్వారా చాలా ఏళ్ల విరామం తరువాత సీనియర్ నటి అర్చన రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ని హీరో నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు కూడా. బజ్ క్రియేట్ అయిన ఈ మూవీని ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
పాతబస్తీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో సునీల్, సుబ్బరాజు, సంపూర్ణేష్ బాబు నటించారు. ఈ మూవీకి ఛాయాగ్రహణం జగదీష్ చీకటి, సంగీతం సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ అన్వర్ అలీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం, సహ నిర్మాత అల్లూరి సురేష్ వర్మ, రచన, దర్శకత్వం జీవన్ రెడ్డి.