‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ‘యువి క్రియేషన్స్’ సంస్థ. ఇప్పటిదాకా ఆ సంస్థ ఐదు సినిమాలు నిర్మిస్తే అందులో నాలుగు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఒక్క ‘జిల్’ సినిమా మాత్రమే కమర్షియల్ ఫెయిల్యూర్ అయింది. నిజానికి ఆ సినిమా కూడా పాజిటివ్ టాకే తెచ్చుకుంది. ‘మిర్చి’ తర్వాత రన్ రాజా రన్.. భలే భలే మగాడివోయ్.. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు ‘యువి క్రియేషన్స్’ బ్రాండ్ వాల్యూను బాగా పెంచాయి. ప్రస్తుతం తెలుగులో మంచి గుడ్ విల్ ఉన్న నిర్మాణ సంస్థల్లో ‘యువి క్రియేషన్స్’ ఒకటి. ఐతే వరుసగా విజయాలు అందుకుంటున్నప్పటికీ ఆ సంస్థ అనుకున్నంత వేగంగా సినిమాలు చేయట్లేదు. ‘మిర్చి’ తర్వాత ఆ స్థాయి పెద్ద సినిమాలు కూడా చేయలేదు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తర్వాత ఆరు నెలలకు పైగా విరామం తీసుకుని ‘భాగమతి’ లాంటి మీడియం బడ్జెట్ సినిమా మొదలుపెట్టింది.
ఐతే వచ్చే ఏడాది నుంచి మాత్రం వరుసగా భారీ సినిమాలు చేయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. తమ బేనర్ కు శుభారంభాన్నిచ్చిన ప్రభాస్ హీరోగా మరో సినిమా చేయడానికి ఎప్పుడో ప్లాన్ చేసింది యువి క్రియేషన్స్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ స్క్రిప్టు రెడీ చేసుకుని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్లే వంద కోట్ల బడ్జెట్ తో మూడు భాషల్లో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది యువి క్రియేషన్స్. అలాగే రామ్ చరణ్ హీరోగానూ ఓ భారీ సినిమా చేయడానికి కమిట్మెంట్ కుదిరింది. ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో మొదలవుతుంది. ఇంకా దర్శకుడెవరన్నది బయటికి రాలేదు. ఇంకో రెండు భారీ సినిమాలకు కూడా సన్నాహాలు చేస్తోంది ఈ సంస్థ.