మెగా స్టార్ చిరంజీవి హీరోగా విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న `సైరా నరసింహా రెడ్డి`చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాక ముందే ...ఉయ్యాల వాడ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఓ వ్యక్తి మీడియాలో హల్ చల్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇపుడు తాజాగా ఉయ్యాలవాడ కుటుంబీకుల నుంచి `సైరా`పై మరో వివాదం రేగుతోంది.
ఉయ్యాలవాడ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తూ....తమను పట్టించుకోవడంలేదంటూ....ఉయ్యాల వాడ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. చిరంజీవిని, రాంచరణ్ ని కలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించినా వీలు కాలేదని....ఉయ్యాలవాడ వంశస్థుడు దస్తగిరిరెడ్డి అన్నారు. ఓ మీడియా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి వంశస్థులు కర్నూలులో ఉన్నారు. ఇప్పటికీ ఉయ్యాలవాడ నివసించిన ఇల్లు అక్కడ ఉంది.
అయితే, తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రను తెరకెక్కిస్తున్నప్పటికీ...తమను సైరా టీం పట్టించుకోవడం లేదని ఉయ్యాలవాడ వారసులు ఆరోపిస్తున్నారు. చిరు - చరణ్ ని కలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాం అని ఉయ్యాలవాడ వారసుడు బాలిరెడ్డి కుమారుడు దస్తగిరిరెడ్డి అన్నారు. బాలిరెడ్డి తాతకు ఉయ్యాలవాడ తాతయ్య అవుతారని, చిన్నతనం నుంచి తాను ఉయ్యాలవాడ చరిత్ర వింటూ పెరిగానని చెప్పారు. చిరును కలిసే ప్రయత్నం చేస్తోన్న....మాటలు చెప్పి పంపేస్తున్నారని...కలిసే అవకాశం ఇవ్వడం లేదని దస్తగిరి అన్నారు. ప్రస్తుతం తాము పేదరికంలో ఉన్నామని, అందుకే చిరు - చరణ్ లను కలవాలని అనుకుంటున్నామని తెలిపారు. ఉయ్యాలవాడ వంశానికి చెందినవారిగా తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.