మోడల్ టర్న్ డ్ హీరోయిన్ వాణీ కపూర్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. తాను ఆశించినంత స్పీడ్ అయితే లేదు. అలాగని ఖాళీగానూ లేదు. ఇన్నాళ్ల కెరీర్.. ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగానే సాగింది. ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ వరుసగా అవకాశాలిచ్చి ఈ కపూర్ గాళ్ కి బూస్ట్ ఇస్తోంది కానీ.. ఏ బ్యాకప్ లేకపోతే ఏమయ్యేదో. సూపర్ మోడల్ గా ర్యాంప్ షోలతో నిరంతరం క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నా.. సినిమాలు మాత్రం అంతగా ఏమీ లేదు. అడపాదడపా ఛాన్సులొస్తున్నాయి తప్ప స్టార్ డమ్ పెంచేంతగా వరుస ఛాన్సులేవీ లేవు.
యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసి అదే సంస్థ నిర్మించిన పలు చిత్రాల్లో రాయికగా నటించింది. తెలుగులో నాని హీరోగా తెరకెక్కించిన ఆహాకల్యాణంలో వాణీ నటించింది. అయితే ఇక్కడ ఆ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. అటుపై తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు కనిపించిందే లేదు.
కట్ చేస్తే.. 2019 ఎండింగులో `వార్` రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో వాణీ ఒంపుసొంపుల వయ్యారాల వడ్డనలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. హృతిక్ లేడీ లవ్ గా ఆరబోతతో కిక్కెక్కించింది. లేటెస్టుగా వాణీ కపూర్ ఫోటోషూట్ ఒకటి వైరల్ గా మారింది. ట్రావెల్ అండ్ లీజర్ ఇండియా మ్యాగజైన్ కవర్ షూట్ కి సంబంధించిన ఫోటోషూట్ ఇది. కవర్ పేజీపై ఆరు అడుగుల ఈ అందగత్తె నిలువెత్తు రూపం మైమరిపిస్తోంది. అల్ట్రా స్టైలిష్ డిజైనర్ లుక్ లో థై స్లిట్ డిజైన్ లో మతులు చెదరగొట్టింది. వాణి ఒడ్డు పొడుగు అందం కుర్రకారు గుండెల్ని సూదంటు రాయిలా తాకుతోంది. ఆ సిల్వర్ తళుకులతో వాణీ సర్పకన్యనే తలపిస్తోంది.
ఇక కెరీర్ పరంగా చూస్తే.. వార్ సినిమా తర్వాత వాణీ మరో భారీ పాన్ ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం `షంషేరా` (ట్రాన్స్- స్వోర్డ్) లో నటిస్తోంది. ఇది కూడా ఆదిత్య చోప్రాకి చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. రణబీర్ కపూర్- సంజయ్ దత్ లాంటి క్రేజీ స్టార్లు నటిస్తున్నారు. 1800 కాలంలో సాగే హిస్టారికల్ మూవీ ఇది.
బ్రిటీష్ వారిపై తిరుగుబాటుకు తెగబడిన డెకోయిట్ల కథ ఇది. ఇందులో రణబీర్ కపూర్ డబుల్ రోల్ పోషిస్తున్నాడు. వాణీ కపూర్ ఇందులో నర్తకిగా నటిస్తోంది. 2018 డిసెంబర్ నుంచే ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. 31 జూలై 2020 న 2డి-3డి-ఐమ్యాక్స్ ఫార్మాట్ థియేటర్లలో రిలీజ్ కానుంది.