ఫొటోటాక్ : యోగా ఫోజ్ తో మతి పోగొడుతున్న నాని హీరోయిన్‌

Update: 2022-12-18 04:30 GMT
నాని హీరోగా నటించిన 'ఆహా కళ్యాణం' సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్. ఈ అమ్మడు ఆ సినిమా ఫెయిల్‌ అవ్వడంతో మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ లో మెల్ల మెల్లగా సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న వాణి కపూర్‌ అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవుతున్నారు. బాడీ మొత్తం వెనక్కి బెండ్ చేసి యోగా ఆసనం వేసినట్లుగా ఉండి.. తన నడుము మరియు క్లీ వేజ్‌ షో ను చేస్తున్న ముద్దుగుమ్మ వాణి కపూర్ అందాల ఆరబోతకు అంతా అవాక్కవుతున్నారు.

రెగ్యులర్ గా అందాల ఆరబోత చేయడం కామన్ విషయం.. స్కిన్‌ షో చేస్తూ ఇలాంటి ఫోజ్ లు ఇచ్చినప్పుడే జనాల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ముద్దుగుమ్మ వాణి కపూర్‌ యొక్క ఈ ఫోజ్ ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కెరీర్‌ ఆరంభం అయ్యి పదేళ్లు అవుతుండగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి యొక్క స్పీడ్ పెరిగింది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు జోరు పెంచుతున్నా కొద్ది సినిమాల్లో ఆఫర్లు పెరుగుతూ ఉన్నాయి.
Tags:    

Similar News