ఫోటో స్టోరి: వాళ్ళని నిద్రపోనివ్వవా?

Update: 2018-02-28 05:15 GMT
బాలీవుడ్ భామ వాణీ కపూర్ ఏ విషయంలో అయినా తెగ డేరింగ్ చేసేస్తుంది. ఆ విషయం ఈ భామ నటించిన బేఫికర్ మూవీతోనే ప్రూవ్ అయిపోయింది. ఒకే సినిమాలో దాదాపు 25 మూతి ముద్దులను హీరోకు అందించిన ఏకైన బ్యూటీ వాణీ కపూర్ మాత్రమే. అటు ట్యాలెంట్ తో పాటు ఇటు అద్భుతమైన సౌందర్యాన్ని కూడా తనలో ఇముడ్చుకున్న ఈ సుందరి.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.

ఇన్ స్టాగ్రామ్ లో వాణీ కపూర్ ను ఏకంగా 17 లక్షల మంది ఫాలో అయిపోతుంటారు. ఇతరులతో కంపేర్ చేస్తే ఈ ఫిగర్ తక్కువ అనిపించవచ్చు కానీ.. అమ్మడి సినిమాల కౌంట్ తో పోల్చితే ఇది చాలా ఎక్కువే. ఇప్పుడీ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఓ పిక్ చూస్తే మతులు పోవాల్సిందే. జస్ట్ నైట్ వేర్ తో బెడ్ పై బజ్జుని మరీ ఓ సెల్ఫీ తీసుకుంది ఈ 29 ఏళ్ల సుందరాంగి. మెరిసిపోతున్న అందాలు ఈ పిక్చర్ లో హైలైట్ అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా ఈ రోజును ఇలా ముగిస్తున్నానంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది.

వాణీ కపూర్ ఆ రోజును ముగించడం సంగతేమో కానీ.. సరిగ్గా జనాలు నిద్రపోయే టైంకు ఈ పిక్ ను పెట్టి రెచ్చగొట్టేసింది. ఇలాంటి ఫోటోలను షేర్ చేసేసి ఆమె బాగానే నిద్రపోతుంది కానీ.. చూసిన జనాల పరిస్థితి ఏంటనే సంగతి మాత్రం ఏ కొంచెం కూడా ఆలోచించకపోతే ఎలా వాణీ.. వాళ్లు కూడా నిద్రపోవాలి కదా!
Tags:    

Similar News