"వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగేయాలనుకున్నా.. అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా తాడో పేడో తెల్చేద్దాం అనుకున్నా... ఎమాటా పైకి రాక మనసేమో ఊరుకోక అయినా ఈ నాటి దాకా అస్సలు అలవాటు లేక ఏదేదో అయిపోతున్నా" ఇదండీ అక్కినేని వారి వరస!
వయసుమీద పడుతున్నా అందంగా ఉంటారు.. అరవైల దగ్గరలో ఉన్న ఇరవైల ఉత్సాహం! ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నాగ్ కి తప్ప ఎవరికీ ఇలాంటి రొమాంటిక్ స్టోరీలు సెట్ అవుతాయి? సాంగ్ లిరిక్స్ ను గమనిస్తే డాన్ దేవా తన లవ్ స్టొరీని డాక్టర్ దాసు కి వివరిస్తున్నట్టుగా ఉంది. 'దేవదాస్' సినిమానుండి మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇది. ఫన్ టోన్ లో సాగే ఈ పాటను రాసింది శాస్త్రిగారు స్వరపరిచింది శర్మగారు..అదేనండీ బాబు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. స్వరబ్రహ్మ మణి శర్మ. పాడింది అనురాగ్ కులకర్ణి- అంజనా సౌమ్య.
లిరికల్ సాంగ్ వీడియోనే అయినప్పటికీ నాగ్ మధ్యలో ఒక రాక్ ఎన్ రోల్ స్టెప్పు వేయడం మాత్రం సూపరో సూపర్. ఫ్లాష్ బ్యాక్ అని సూచిస్తూ స్టీమ్ ఇంజిన్ ట్రైన్ - రైల్వే స్టేషన్ సెటప్ లో సాంగ్ ను చిత్రీకరించారు. ఇక దేవాను - అయన ఘనతలను చూస్తూ నాని గారు నోరెళ్ళబెట్టారు. రష్మికను లైన్లో దింపడానికి నానికి అక్కినేని వారు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఓవరాల్ గా సాంగ్ జనాలకు కనెక్ట్ అయ్యేలానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక లుక్కేయండి. అక్కినేని వారి అమూల్యమైన సిద్దాంతాన్ని అర్థం చేసుకోండి!