సైరాపై హైకోర్టుకు వడ్డెర కులస్తులు

Update: 2019-09-30 10:14 GMT
తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైరా సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాకు ఇప్పటికే ఉయ్యాలవాడ వంశీకుల అభ్యంతరాలు.. కంప్లైంట్లు.. కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాక ముందే.. మరో కొత్త వివాదం ఇప్పుడు షురూ అయ్యింది. సైరాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడైన వడ్డెర ఒబన్నపాత్రను వక్రీకరించారన్నది తాజా ఆరోపణ.

సైరాలో ఒబన్న పాత్రను మరో పాత్రతో భర్తీ చేశారని.. అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకున్న అభ్యంతరాన్ని పరిశీలించాలంటూ వడ్డెర కులస్తులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ క్లియరెన్స్ ను నిలిపివేయాలని వారుకోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సినిమాలో ఒబన్న పాత్రను రాజు పాండేగా మరో పాత్రతో భర్తీ చేశారని.. ఇలా చేయటం చరిత్రను వక్రీకరించటమేనని వారు మండిపడుతున్నారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితంలో లేని పాత్రను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయటం చరిత్రను వక్రీకరించటం కాదా? అని మండిపడుతున్నారు.

సినిమా విడుదలను ఆపని పక్షంలో.. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల వద్ద సినిమాను వడ్డెర కులస్తులు అడ్డుకుంటారని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి.. ఈ వివాదం నుంచి సైరా టీం ఎలా బయటపడుతుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. రిలీజ్ కు మరో రెండు రోజులు మాత్రమే ఉన్న వేళ.. కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్న వేళ.. వీటిని మెగా ఫ్యామిలీ ఎలా డీల్ చేస్తుందో చూడాలి.


Tags:    

Similar News