చిన్మయి ఆరోపణలపై వైరముత్తు రియాక్షన్‌!

Update: 2018-10-10 11:40 GMT
బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా మీటూ ఉద్యమం ఉదృతం అయ్యింది. సౌత్‌ లో మొదటగా ప్రముఖ సింగర్‌ చిన్మయి తనపై చిన్నతనంలో - ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన లైంగిక వేదింపులను సోషల్‌ మీడియా ద్వారా అందరి ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. చిన్మయి తనపై జరిగిన లైంగిక వేదింపులను మీడియా ముందు ఉంచిన క్రమంలో ఆమెతో పలువురు తమకు ఎదురైన లైంగిక వేదింపుల అనుభవాలను పంచుకున్నారట. పలువురు సింగర్స్‌ తనతో ప్రముఖ రచయిత వైరముత్తు లైంగిక ఆరోపణల గురించి చెప్పారంటూ సుదీర్ఘమైన పోస్ట్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన చిన్మయి సంచలనం సృష్టించింది.

చిన్మయి చేసిన ఆరోపణలు ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఒక గొప్ప రచయిత - కవి అయిన వైరముత్తుపై చిన్మయి విమర్శలు చేయడంను కొందరు తప్పు పడుతుంటే - మరి కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఒక అమ్మాయి తనకు - తనవారికి లైంగిక వేదింపులు ఎదురయ్యాయి అంటూ చెబుతుంటే ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవాలని - వెంటనే విచారణ జరిపించాలని కూడా ఎక్కువ శాతం మంది సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వంను కోరుతున్నారు. ఈ సమయంలో వైరముత్తు స్పందించారు.

ట్విట్టర్‌ వేదికగా వైరమత్తు ఈ విషయంపై స్పందిస్తూ... దేశ వ్యాప్తంగా ప్రముఖ వ్యక్తుల గురించి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌ అయ్యింది - నన్ను కావాలని కొందరు టార్గెట్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. తనపై కొందరు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు నేనేం సమాధానం చెప్పను. ఆ ఆరోపణలపై కాలమే సమాధానం చెబుతుందని ఈ సందర్బంగా వైరముత్తు పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ కు మద్దతుగా - వ్యతిరేకంగా భారీ ఎత్తున కామెంట్స్‌ వస్తున్నాయి. వైరముత్తు వంటి ప్రముఖ రచయితపై ఆరోపణల నేపథ్యంలో మొత్తం తమిళ సినిమా పరిశ్రమలో ఈ విషయమై చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News