అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు .. సాంగ్స్ ను రిలీజ్ చేసినప్పుడు అందులో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ను వైష్ణవ్ ఫాలో కావడం కనిపించింది. అలాగే చిరంజీవి స్టైల్ ను కూడా అనుకరించినట్టుగా అనిపించింది. సినిమా చూస్తే నిజంగానే మెగా ఫ్యాన్స్ లో హుషారెత్తించే ఇలాంటి ప్రయత్నాలు వైష్ణవ్ చేశాడు.
కుర్రాడు ఒడ్డూ పొడుగూ ఉన్నాడు .. మేనమామల స్టైల్ ను అదరగొట్టేస్తున్నాడు అనే టాక్ వచ్చింది. దాంతో ఈ కుర్రాడు చిరంజీవి సినిమాలనుగానీ .. పవన్ కల్యాణ్ సినిమాలనుగాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడా? అనే డౌట్ మెగా అభిమానులకే వచ్చింది.
తాజా ఇంటర్వ్యూలో వైష్ణవ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే అలాంటి ఆలోచన తనకి ఎంతమాత్రం లేదని వైష్ణవ్ తేల్చేశాడు. ఆయన మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్ద మామయ్య .. చిన్న మామయ్య సినిమాలను చూస్తూ పెరిగాను.
అందువలన వాళ్లను సరదాగా అనుకరించే ప్రయత్నం చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాను. అనుకోకుండా ఆ ఇద్దరినీ మేనరిజమ్స్ ను ఈ సినిమాలో వర్కౌట్ చేయడానికి అవకాశం కుదిరింది. అందువలన అలా చేయడం జరిగింది. ఇక వాళ్ల సినిమాలను రీమేక్ చేసే ఆలోచన ఎంతమాత్రం లేదు.
పెద్ద మామయ్య .. చిన్న మామయ్య సినిమాలలో కొన్ని వారు మాత్రమే చేయగలరు. ఆ పాత్రలు వాళ్ల బాడీ లాంగ్వేజ్ కి మాత్రమే సెట్ అవుతాయి. అలాంటి సినిమాల రీమేకుల జోలికి నేను వెళ్లాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా మేకర్స్ వచ్చి ఫలానా రీమేకులో మీరు చేయవలసిందే అని పట్టుబడితే మాత్రం, ఆ సినిమా 'బద్రీ' అయ్యుండాలని కోరుకుంటాను.
ఆ సినిమా అంటే నాకు అంత ఇష్టం. కాకపోతే అలాంటి ఒక అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. 'రంగ రంగ వైభవంగా' చూసినవారిలో కొందరు, 'నిన్నే పెళ్లాడుతా' .. 'ఖుషి' తరహాలో ఉందని అంటున్నారు. కానీ అలా అనుకుని చేసిన సినిమా కాదు ఇది. ఈ సినిమా తరువాత సితార బ్యానర్లో శ్రీకాంత్ రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడి సినిమాను ఒప్పుకున్నాను. అంతకు మించి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.