వైష్ణవ్ తేజ్ కళ్లు చాలా పవర్ఫుల్‌ గా ఉంటాయి: రకుల్ ప్రీత్ సింగ్

Update: 2021-10-06 15:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సెన్సేష‌న్ పంజా వైష్ణవ్ తేజ్ - స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ''కొండ పొలం''. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ యాక్షన్ అడ్వెంచ‌ర‌స్ మూవీ అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ర‌కుల్‌ ప్రీత్ సింగ్ చెప్పిన సినిమా విశేషాలు..

* 'కరెంటు తీగ', 'రారండోయ్ వేడుకచూద్దాం', 'ఖాకీ'.. ఇలా చాలా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయి పాత్రలు పోషించాను. కానీ 'కొండ పొలం' విషయంలో మాత్రం నాది చాలా డిఫరెంట్‌ క్యారెక్టర్. గొర్రెలు కాసే అమ్మాయిగా  క‌నిపిస్తాను. ఈ పాత్ర కోసం స్కిన్ ట్యాన్ కూడా చేశారు. ఈ క్యారెక్ట‌ర్‌ నేను చేయగలనని నమ్మి నాకు ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్.

* 'కొండ పొలం' సినిమా కోసం నేనేమీ బరువు తగ్గలేదు. 'దే దే ప్యార్ దే' సినిమా కోసం తగ్గాను. గత నాలుగేళ్ల నుంచి అదే వెయిట్ మెయింటేన్ చేస్తూ వ‌స్తున్నాను. క్రిష్ గారు కథ చెప్పేందుకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను షార్ట్ టీషర్ట్ వేసుకుని ఉన్నాను. ఇంత యంగ్‌ గా ఉన్నావ్.. నాకు కావాల్సింది ఇదే.. పక్కన వైష్ణవ్ తేజ్ ఉంటాడు.. ఇదే కావాల్సింది అంటూ క్రిష్ గారు ఎగ్జైట్ అయ్యారు. నెరేషన్ మధ్యలోనే నాకు సినిమా కథ ఎంతో నచ్చింది. ఇలాంటిది ఇంత వరకు ఇండియన్ సినిమాలోనే రాలేదు. గొర్రెల కాపర్ల గురించి, మినీ జంగిల్ బుక్ లాంటి చిత్రం ఇంత వరకు రాలేదు. అందుకే ఈ కథకు వెంటనే ఓకే చెప్పేశాను.

* ప్రత్యేకమైన యాసలో మాట్లాడేందుకు చాలా కష్టపడ్డాను. ఫస్ట్ లుక్ కోసం కూడా చాలా ట్రై చేశాం. స్కిన్ టాన్‌ ను ఎంతగా తగ్గించాలని బాగా ఆలోచించాం. వారంతా ఒకే ర‌కం బట్టలను వేసుకుంటారు. నగలు కూడా ఎక్కువగా వేసుకోరు. అడ‌విలో ఆ గొర్రెలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. నేను, వైష్ణవ్ ఇద్దరం చాలా కష్టపడ్డాం. సాయంత్రం వచ్చే సరికి మా నుంచి కూడా  గొర్రెల వాసన వచ్చేది. షూటింగ్ స్టార్ట్ చేసిన‌ నాలుగైదు రోజుల్లోనే గొర్రెలను కంట్రోల్ చేయడం తెలిసింది.

* అడవిలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌ గా అనిపించింది. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్నాం. ఆ తరువాత వెంటనే అడవిలో షూటింగ్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు కరోనా రాకముందే ఈ సినిమా షూటింగ్ చేశాం. దాదాపుగా సింగిల్ షెడ్యూల్‌ లోనే ఈ సినిమా మొత్తం పూర్తయింది.

* వికారాబాద్‌ లోని రిసార్ట్‌ లోనే మేం ఉన్నాం. రాత్రి పూట షూటింగ్ చేయాలంటే అక్కడ పర్మిషన్ లేదు. అందుకే ఉదయాన్నే షూటింగ్ కు వెళ్లేవాళ్లం. మా కార్వాన్ లు ఎక్కడో రోడ్డుపైన ఉండేవి. మేం అడవిలో షూటింగ్ చేసేవాళ్లం. లంచ్ టైంలో అక్కడికి వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేసినట్టుగా అనిపించేది. అలా నాకు వర్కవుట్లు కూడా అయ్యేవి. అందుకే నేను ప్రతీ రోజూ అలా దూరంగా ఉన్న చోటకు వెళ్లి తినేదాన్ని.

* క్రిష్ గారి ఆలోచన వల్లే అనుకున్న‌ సమయంలోనే షూటింగ్‌ ను పూర్తిచేశాం. వర్షం వస్తే వర్షంలో ఉన్న సీన్స్‌ ను తెరకెక్కించేవారు. మేం అంతా కూడా ఆ పాత్రలను బాగా ఎంజాయ్ చేశాం. వైష్ణవ్ తేజ్ కళ్లు చాలా పవర్ఫుల్‌ గా ఉంటాయి. ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఎంతో ఒదిగి ఉంటాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్స‌లు ఉండదు. ఎంతో నేర్చుకోవాలనే తపన ఉంటుంది.

* వేరే షూటింగ్‌ లో ఉండటం వల్లే డబ్బింగ్ చెప్పలేకపోయాను. డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఓబులమ్మ పాత్రను ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చుతుంది. క్రిష్ గారికి, నాకూ ఈ పాత్ర ఎంతో ఇష్టమో.. అందరికీ అలానే నచ్చుతుంద‌ని ఆశిస్తున్నారు.

* సినిమా చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ షూట్ చేయడం మాత్రం చాలా కష్టం. లెహంగా ధరించి అడవిలో నడుస్తూ వెళ్లడమే కష్టం. అలాంటిది పెద్ద పెద్ద కెమెరాలను మోస్తూ షూటింగ్‌ స్పాట్‌ కు నడుస్తూ వెళ్లేవాళ్ల ప‌రిస్థితి మీరే ఆలోచించండి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అద్భుతంగా ఉంది. 'ఓబులమ్మ' పాట నాకు చాలా ఇష్టం. కెమెరామెన్ బాబా గారు నన్ను రిఫర్ చేశారు. నెరేషన్ సమయంలోనే నాకు ఆ విషయం తెలిసింది. ఈ సినిమాలో న‌న్ను చాలా అందంగా చూపించారు.

* సాయి ధరమ్ తేజ్‌ తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్ తేజ్ దగ్గరి నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకుంటున్నారు. ఇంకా త్వరగా కోలుకోని.. సెట్స్ మీదకు తిరిగి రావాల‌ని కోరుకుంటున్నారు.

* సాంగ్స్ - కొన్ని సీన్స్ ఉండే పాత్రలను చేయాలని అనుకోవడం లేదు. ఏదైనా చాలెంజింగ్ అనిపించే రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. అందుకే సెలెక్టివ్‌ గా ఉంటున్నాను. 'కొండ పొలం' సినిమా.. ఆ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఒప్పుకొన్నాను. అలా నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా ఎక్కడైనా సినిమాలు చేస్తాను. అంతే కానీ బాలీవుడ్‌ లోనే ఎక్కువ చేస్తున్నారు.. టాలీవుడ్‌ లో చేయడం లేదంటే నేను ఒప్పుకోను. ఏడాదికి 365 రోజులే ఉంటాయి. అందులో నేను ఆరు సినిమాలు చేయగలను. అలానే ఇప్పుడు కూడా చేస్తున్నాను.

* ఓటీటీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు సైన్ చేయలేదు. ఒకవేళ ఓటీటీలో చేస్తే అది కచ్చితంగా పాత్ బ్రేకింగ్‌ లా ఉండాలని అనుకుంటున్నాను. ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలను చేయాలని ఉంది. ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ వస్తోంది. 'కరణం మల్లీశ్వరీ' సినిమా చేస్తున్నానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు.

* ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాయి. ఇప్పుడు ముంబైలోనే ఉంటున్నాను. తెలుగు టీం నాతో ఉంటుంది.. తెలుగులోనే మాట్లాడుతుంటాం.. అక్కడ అందరూ నన్ను తెలుగమ్మాయని అనుకుంటారు. వచ్చే ఏడాది ఆరు చిత్రాలు రిలీజ్ కాబోతోన్నాయి. వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

* నా డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక 'దిల్ వాలే దుల్హానియా లేజాయెంగే'.. ఒక 'బాహుబలి' లాంటి సినిమాలు చేస్తే చాలు అనిపిస్తుంది. అలాంటి కేటగిరిల్లో 'కొండ పొలం' కూడా ఉంటుందని న‌మ్ముతున్నాను.

* నిర్మాత రాజీవ్ రెడ్డి చాలా మంచి వారు. సైలెంట్‌ గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆయన ప్ర‌తీది గమనిస్తుంటారు. క్రిష్ గారు కూడా ఈ చిత్రానికి నిర్మాత. ఆ ఇద్దరూ కలిసి వ‌ర్క్ షేర్ చేసుకునేవారు. వారితో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది

* 'మేడే' షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు కరోనా సోకింది. ఇప్పటివరకు 'డాక్టర్ జీ' షూటింగ్ చేశాను. 'మేడే' షూటింగ్ కూడా అయిపోయింది. అక్షయ్ జీ సినిమా కూడా షూటింగ్ పూర్త‌య్యింది.
Tags:    

Similar News