నిజానికి డైరెక్టర్ కావాలనుకున్నా: వైష్ణవ్ తేజ్ ఫుల్ ఇంటర్వ్యూ

Update: 2021-02-08 12:30 GMT
మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న యువహీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో డైరెక్టర్ బుచ్చిబాబు సాన, హీరోయిన్ కృతిశెట్టి డెబ్యూ అవుతున్నారు. ఇక తాజాగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన గురించి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వైష్ణవ్ చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం!


హాయ్ వైష్ణవ్.. డెబ్యూ ఫిల్మ్ విడుదలకు ముందే సూపర్ హిట్ అనే టాక్ ఎలా అనిపిస్తుంది?

హాయ్ అండి. ఉప్పెన సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లకు ఇంత గొప్ప స్పందన రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా టీమ్ వర్క్ అండి. ప్రతి ఒక్కరూ మా కష్టాన్ని గుర్తించి, మా నిర్మాతలకు మంచి లాభాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

అసలు హీరో కాకముందు ఏమవుదాం అనుకున్నారు?

నిజానికి ఒక్కటి కాదండీ. చిన్నప్పుడు చాలా అనుకున్నాను. సైంటిస్ట్, ఆస్ట్రానాట్, డైరెక్టర్, ఫోటోగ్రఫీ ఇలా చాలా అనుకున్నాను. అన్నింట్లో నన్ను నేను ఊహించుకున్నాను. కానీ ఆఖరికి ఏది సెట్ కాలేదు. ఉప్పెనకు ముందు వరకు ఇంట్లో ఖాళీగా ఉండేవాడిని. రోజు లేవడం, జిమ్ చేయడం మళ్లీ ఖాళీ. ఇలా గడుస్తుండేది. నా మీద నాకే డౌట్ వచ్చి మమ్మీకి చెబుతుండేవాడిని. నేనేమైనా చేయగలనా.. ఇంతేనా అని. అసలు అనుకోకుండా హీరో అయ్యాను.

ఉప్పెనకు సంతకం చేయడానికి ముందు వేరే కథలు విన్నారా?

బుచ్చిబాబు స్క్రిప్ట్ కంటే ముందు నాకు పేరున్న డైరెక్టర్స్ నుండి కొన్ని ఆఫర్లు వచ్చాయి. సగం స్క్రిప్ట్స్ వలన నేను నో చెప్పాను. అయితే తర్వాత బుచ్చిబాబు వచ్చి ఉప్పెన చెప్పాగానే కథ నచ్చింది. ఇదే నా ఫస్ట్ మూవీ అయింది.

సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ చూసినప్పుడు మీరు కొత్తగా కనిపించారు. సిటీ లవ్ స్టోరీలకు బాగా సరిపోతారని చాలామంది అనుకున్నారు. మరి విలేజ్ నేపథ్యంలో కథ చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి?

నేను విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాతో డెబ్యూ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథకోసం ఎదురుచూశాను. అలా సెట్ అయింది.

బుచ్చిబాబుతో వర్క్ ఎలా అనిపించింది?

బుచ్చిబాబు చాలా కష్టపడ్డాడు. అతను ఫస్ట్ నుండి కూడా స్క్రిప్ట్ ను బలంగా నమ్మాడు. అతనితో వర్క్ చాలా మంచి ఎక్స్పీరియన్స్.

ఉప్పెన టీజర్ - ట్రైలర్ విడుదలయ్యాక మీకు కాల్స్ వచ్చే ఉంటాయే?

నేను యాక్టింగ్ లో సెట్ అయ్యానని చాలామంది చెప్పారు. అలాగే సినిమా రిలీజ్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఉనట్లు చెప్పారు.

మరి పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూశారా? చూసాక ఏమన్నారు?

అవును మావయ్య ట్రైలర్‌ చూసి బాగుందని చెప్పాడు. ముఖ్యంగా డైలాగ్స్ బాగా మామయ్య నాతో పాటు కృతిని కూడా మెచ్చుకున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల గురించి?

నిర్మాతలు చాలా హెల్ప్ చేశారు. ఖర్చు గురించి అసలు వెనుకాడలేదు. ఫస్ట్ లో ఓటిటి చేయాలనీ మళ్లీ రిజెక్ట్ చేశారు. కానీ ఫస్ట్ మూవీనే మైత్రి లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది.

విజయ్ సేతుపతి గురించి మీ మాటల్లో?

విజయ్ సేతుపతి చాలా హంబుల్ - డౌన్ టు ఎర్త్.

కృతిశెట్టి లుక్స్ పరంగా.. నటనపరంగా ప్రశంసలు అందుకుంటుంది. ఆమెతో ఎలా ఉండేది వాతావరణం?

కృతిశెట్టి చాలా టేలెంటెడ్. అందుకే ఒక వారం రోజుల్లో తెలుగు నేర్చుకుంది. బాగా యాక్ట్ చేసింది అండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్.

మీ మొదటి సినిమా విడుదలకు ముందే మీ రెండవమూవీ పూర్తయింది. మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనుకుంటున్నారా?

నేను ఒకదాని తరువాత ఒకటి సినిమాలు చేయటానికి అంత తొందరగా లేను. లాక్డౌన్ టైంలో క్రిష్ నాకు కథను వివరించినప్పుడు, నా పాత్ర, స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది.

ఇంతకుముందు కూడా అందరివాడు, శంకర్ దాదా సినిమాలలో కనిపించారు. అప్పుడెలా ఉండేది కెమెరా ఫియర్?

నిజానికి అప్పుడు నాకేం తెలియదు. ఫస్ట్ నేను కనిపించింది జానీ సినిమాలో. మా పవన్ మామ బొమ్మలు కొనిస్తా అంటే వెళ్లి చేసాను. ఇక శంకర్ దాదా సినిమాలో ఎలా చేసానో నాకే తెలియదు. మా తాతగారి కుర్చీలో అలా కదలకుండా కూర్చొని కల్లార్పకుండా చూడాలని పెద్ద మావయ్య చెప్పారు నేను చేశా.

హీరో అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా?

అసలు అనుకోలేదు. అలాగని ఉహించుకోలేను కూడా. నాకు ఇండస్ట్రీలో అందరు హీరోలు ఇష్టమే. అందరి సినిమాలు చూసి ఎంజాయ్ చేశావాడ్ని. భరత్ అనే నేనులో మహేష్ అసెంబ్లీ డైలాగ్స్ సూపర్ అనిపిస్తాయి. వీళ్లంతా ఎలా చేస్తున్నారు అనుకున్నా.

ఉప్పెన కోసం ఎలా రెడీ అయ్యారు?

అక్కడి స్లాంగ్ నేర్చుకున్నాను. కొందరు అబ్బాయిలు నేర్పించారు. వాళ్ళ వాయిస్ రికార్డు చేసి వింటూ ప్రాక్టీస్ చేసాను. పదాలను ఎలా పలకాలి.. ఫిషర్ మ్యాన్ స్లాంగ్ ఎలా అనేవి దాదాపు 40డేస్ పట్టింది కంప్లీట్ గా రెడీ అయ్యేసరికి. మిగతా విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా సినిమా విడుదలయ్యాక ఆన్సర్ చేస్తాను.

ఓకే థాంక్యూ వైష్ణవ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీ ఉప్పెన బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.



Tags:    

Similar News