బేసిగ్గా నాకు కాస్త సిగ్గెక్కువ: వైష్ణవ్ తేజ్

Update: 2022-08-31 03:11 GMT
వైష్ణవ్ తేజ త్తన మొదటి సినిమాను కొత్త దర్శకుడితోనే చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమా అయిన 'రంగ రంగ వైభవంగా' దర్శకుడుకి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. సాయితేజ్ తన కెరియర్ తొలినాళ్లలో మెగాస్టార్ ను అనుకరిస్తే, వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో అక్కడక్కడా పవన్ ను ఇమిటేట్ చేయడం కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఆయన జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేసింది. సాయితేజ్ - వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ .. "ముందుగా మెగా అభిమానులందరికీ నమస్కారం.  ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన మా అన్నయ్యకి .. బావకి థ్యాంక్స్ చెబుతున్నాను. గిరిగారు కథ చెప్పిన దగ్గర నుంచి మార్పులు చెబుతూ ఆయనను కాస్త ఇబ్బంది పెట్టాను.

డైరెక్షన్ టీమ్ అంతా కూడా ఎంతో అంకితభావంతో పని చేయడం వల్లనే సినిమా అంతా ఎంతో సాఫీగా వెళ్లిపోయింది. శ్యామ్ దత్ గారు 'ఉప్పెన' సినిమా నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు.

బేసిగ్గా నాకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ కేతిక ఇచ్చిన కంఫర్ట్ వలన .. తాను ఈజ్ తో చేయడం వలన నేను మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. అలా తను మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి విషయానికి వస్తే, 'ఉప్పెన' తరువాత ఆయన ఈ సినిమాకి పని చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఈ కథ వినగానే నిజంగానే నాకు బాగా నచ్చింది. అంతే జన్యూన్ గా మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.

ఈ సినిమాలో నాతో పాటు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు చేశారు. వాళ్ల దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సెప్టెంబర్ 2వ తేదీన మా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అలాగే అదే రోజున 'ఫస్టు డే ఫస్టు షో' సినిమా వస్తోంది .. ఆ సినిమాను కూడా చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News