రికార్డు స్థాయి స్క్రీన్స్ లో 'వకీల్ సాబ్'

Update: 2021-04-02 11:45 GMT
'అజ్ఞాతవాసి' పరాజయం తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. మూడేళ్ళ తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది 'పింక్' చిత్రానికి రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మించారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. రీమేక్ సినిమా మాదిరి కాకుండా పవన్ క్రేజ్ కి తగ్గట్టు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్స్ చేస్తున్నారు.

ఓవర్ సీస్ లో 'వకీల్ సాబ్' చిత్రాన్ని 700 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ప్రకటించారు. అలానే ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ లలో కూడా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల అవుతున్న తెలుగు సినిమా ఇదేనని ఆయన పేర్కొన్నారు. పవన్ గత చిత్రం 'అజ్ఞాతవాసి' యూఎస్ లో 500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు 'వకీల్ సాబ్' కోవిడ్ నేపథ్యంలో కూడా ఓవర్ సీస్ లో ఈ రేంజ్ లో విడుదల అవుతుండటం గమనార్హం. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రంలో 'శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. అంజలి - నివేదా థామస్ - అనన్య - ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చారు.
Tags:    

Similar News