పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూల్ చేసింది. అయితే మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించడంతో తెలుగు రాష్ట్రాలలో పవన్ అభిమానులు వకీల్ సాబ్ విజయాన్ని ఓ రేంజిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే మాములుగా థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి సినిమాలు మినిమం 56రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ అవుతాయి. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ వార్తలు కాస్త ముందుగానే వినిపిస్తున్నాయి. ఇటీవలే వకీల్ సాబ్ మూవీ ఖచ్చితంగా 56రోజులకు వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పేసాడు.
కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ చెప్పిన దానికంటే ముందే ఓటిటి రిలీజ్ కాబోతుందని టాక్. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు వకీల్ సాబ్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అమెజాన్ భారీగానే చెల్లించిందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వణుకు పుట్టిస్తున్న నేపథ్యంలో త్వరలో సినిమా థియేటర్స్ మూతపడేలా పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో వకీల్ సాబ్ మూవీని త్వరగా డిజిటల్ రిలీజ్ చేసే దిశగా అమెజాన్ వారు దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నారట. మరి చర్చలు ముగిసాక వకీల్ సాబ్ డిజిటల్ ఎంట్రీ ఎప్పుడనేది తెలుస్తుంది. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కించగా అంజలి, నివేదాథామస్, అనన్య కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.