అల్లు అర్జున్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయి రిలీజ్ కూడా అవ్వాల్సింది. లాస్ట్ ఇయర్ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా 'ఐకాన్' ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. కారణాలు ఏంటో తెలియవు కాని దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీ పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో బన్నీ 'అల వైకుంఠపురంలో' సినిమా కంప్లీట్ చేయడంతో పాటు 'పుష్ప'ని లైన్లో పెట్టాడు. దీంతో 'ఐకాన్' ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అందరూ భావించారు. అయితే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా 'ఐకాన్' పోస్టర్ రిలీజ్ చేసి ఈ సినిమా ఉందని తెలిసేలా చేశారు.
ఇదిలా ఉండగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' సినిమా రూపొందిస్తున్నారు. 'పింక్' రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'వకీల్ సాబ్' వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఒకవేళ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే వెంటనే 'ఐకాన్' పట్టాలెక్కించడానికి బన్నీ ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి.
కాకపోతే 'వకీల్ సాబ్' రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి హిట్ అయితే వేణు శ్రీరామ్ ఏ హీరో కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బన్నీ 'ఐకాన్' స్టార్ట్ అయినా కాకపోయినా వేణు శ్రీరామ్ కి క్రేజీ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా 'వకీల్ సాబ్' నిరాశపరిస్తే మాత్రం వేణు శ్రీరామ్ కచ్చితంగా అల్లు అర్జున్ తో 'ఐకాన్' మూవీ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' ప్లాప్ అయితే బన్నీ 'ఐకాన్' ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టే అవకాశాలు లేకపోలేదు. సో మొత్తం మీద డైరెక్టర్ వేణు శ్రీరామ్ కెరీర్ కి రీమేక్ సినిమా అయినా 'వకీల్ సాబ్' రిజల్ట్ చాలా కీలకమని చెప్పవచ్చు.