‘నా పేరు సూర్య’సినిమా నుంచి నిన్న రిలీజ్ చేసిన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు అదిరిపోయాయి. థియేటర్లలో ఈ పాట అభిమానుల్ని ఉర్రూతలూగించేలా కనిపిస్తోంది. తనదైన స్టైల్.. గ్రేస్ కలగలిపి బన్నీ ఈ పాటలో అదరగొట్టేసినట్లే కనిపిస్తున్నాడు. కేవలం డ్యాన్సులతోనే కాదు.. క్యాప్ చేతిలో పెట్టుకుని చేసిన ఒక ట్రిక్ తోనూ బన్నీ అభిమానుల్ని అలరించేట్లున్నాడు. ఈ ట్రిక్ చూస్తుంటే గతంలో మైకేల్ జాక్సన్ చేసిన ఒక విన్యాసం గుర్తుకొస్తోంది జనాలకు.
ఈ పాట ప్రోమో చివర్లో బన్నీ చేసిన క్యాప్ ట్రిక్ భలేగా అనిపిస్తోంది. ఐతే ఆ ట్రిక్ వెనుక ఏదో ఎఫెక్ట్ ఉన్న భావన కలుగుతోంది. కానీ అందులో మాయా మర్మం ఏమీ లేదట. బన్నీ స్వయంగా ఆ ట్రిక్ సాధన చేసి ఒరిజినల్ గానే చేశాడట. ఈ విషయంలో చిత్ర సమర్పకుడు నాగబాబుకు క్లారిటీ లేక అది నిజమా.. ట్రిక్కా అని అడిగాడు ప్రసంగిస్తున్నపుడు. దీనిపై ఆ తర్వాత దర్శకుడు వక్కంతం వంశీ క్లారిటీ ఇచ్చాడు. అందులో ఏ ట్రిక్ లేదని.. బన్నీ ఒరిజినల్ గానే అది చేశాడని అన్నాడు.
ఆ ట్రిక్ కోసం బన్నీ చాలా రోజులు కష్టపడ్డాడట. ప్రతి రోజూ షూటింగ్ అవ్వగానే క్యాప్ పట్టుకుని సాధన మొదలుపెట్టేవాడట. ట్రైనర్స్ వచ్చి గ్రాఫిక్ ద్వారా మేనేజ్ చేద్దామన్నా బన్నీ ఒప్పుకోలేదట. నేను ప్రయత్నిస్తా.. నా వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం అంటూ.. చాలా రోజుల పాటు అలాగే సాధన చేసి ఆ ట్రిక్ నేర్చుకున్నాడని.. థియేటర్లలో ఇది జనాలతో విజిల్స్ కొట్టిస్తుందని వక్కంతం అన్నాడు. గత ఏడాది ‘డీజే’లో ఫ్రిడ్జెంట్ స్పిన్నర్ తిప్పడాన్ని ఒక ట్రెండ్ గా మార్చేశాడు బన్నీ. మరి ‘నా పేరు సూర్య’తో ఈ క్యాప్ ట్రిక్ అలాగే ట్రెండ్ అవుతుందేమో చూద్దాం.