నందమూరి మల్టీస్టారర్.. ఫిక్సయిపోండి

Update: 2016-01-19 15:30 GMT
మొన్నామధ్య తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ బేనర్ లో తానో సినిమా చేయాల్సి ఉందని ఎన్టీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో మాత్రం చెప్పలేనన్నాడు ఎన్టీఆర్. ఐతే అన్నయ్య బేనర్లో తమ్ముడి సినిమా కోసం మరీ ఎక్కువ కాలమేమీ ఎదురు చూడాల్సిన పనేమీ ఉండదట. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే కావచ్చని సమాచారం.

నందమూరి సోదరుల సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం దాదాపు ఖాయం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అతడి అభిరుచికి తగ్గట్లు కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట వంశీ. సురేందర్ రెడ్డి ప్రతి సినిమాకూ పని చేసే వక్కంతం.. అతడికి టాటా చెప్పేసి తన డైరక్టోరియల్ డెబ్యూ మూవీ కోసం కష్టపడుతున్నాడట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తాడని.. ఒకరకంగా ఇది నందమూరి మల్టీస్టారర్ అని అంటున్నారు. బడ్జెట్ భారీగానే ఉంటుందని.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Tags:    

Similar News