కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `వలిమై`. బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ బ్యానర్లపై బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా.. హుమా ఖురేషి హీరోయిన్గా చేసింది. యువన్ శంకర్ రాజా స్వరాలు అందించారు.
హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న తమిళ్, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుదల అయింది. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతోంది. స్టోరీ రొటీన్‌గానే ఉన్నా.. బైక్ రేసింగ్‌లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఆకట్టుకుంటాయి.
ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోగా.. ఆయన్ను ఢీ కొట్టే విలన్‌గా కార్తికేయ అదరగొట్టేశాడు. వీరిద్దరూ తెరపై నువ్వా, నేనా అన్నట్లు నటించి మెప్పించారు. మొత్తానికి యాక్షన్ ప్రియులను బాగానే అలరించిన ఈ మూవీ.. తమిళనాట సూపర్ కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజైన సినిమాలు కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోనూ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వలిమై త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. మార్చి 25 తేదీని స్ట్రీమింగ్ డేట్‌గా కన్ఫార్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.