ప్రీరిలీజ్ వ‌ర‌కూ ఓకే.. రిలీజ్ సంగ‌తేంటి?

Update: 2019-09-14 06:36 GMT
వ‌రుణ్ తేజ్ కథానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన `వాల్మీకి` ఈనెల 20న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు.. టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ జిగ‌ర్తాండ రీమేక్ గా తెర‌కెక్కించిన ఈ సినిమా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి పేరు తెస్తుంద‌ని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ ముంగిట ఊహించ‌ని విధంగా టైటిల్ వివాదం ర‌చ్చ‌కెక్కింది. వాల్మీకి బోయ‌లు కోర్టుకు వెళ్ల‌డంతో అది కాస్తా డైల‌మాలో ప‌డింద‌న్న ముచ్చ‌ట సాగుతోంది.

నాలుగు వారాల్లో వాల్మీకి టీమ్ పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌డంతో అస‌లేం జ‌రుగుతోంది అన్న చ‌ర్చ సాగుతోంది. మ‌రి వాల్మీకి టీమ్ కి అంత టైముందా? ఈనెల 20న సినిమాని రిలీజ్ చేయాల్సి ఉండ‌గా నాలుగు వారాల త‌ర్వాత కౌంటరేమిటి? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్ప‌టికీ ఈ నెల 20వ తేదీన విడుదల ప్లాన్ చేశారా లేదా అన్న‌ది తేల‌లేదు.

అంత‌కంటే ముందే.. ఈనెల 15న (ఆదివారం) ప్రీరిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు...  ఈవెంట్ ని వాయిదా వేయ‌లేదు క‌దా..! అంటూ మాటా మంతీ సాగుతోంది. విక్ట‌రీ వెంక‌టేష్ అతిధిగా ప్రీరిలీజ్ వేడుక 15 సాయంత్రం శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌క‌టించారు తాజాగా. అయితే ప్రీరిలీజ్ వ‌ర‌కూ ఓకే.. రిలీజ్ ఒక్క‌టే డైల‌మానా? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. హైకోర్టు తీర్పు తో `వాల్మీకి`పై అష్ఠ‌దిగ్భంద‌నం జ‌రిగిందా అంటూ ఓ వ‌ర్గం సందేహం వ్య‌క్తం చేస్తోంది. అయితే దేనికైనా 14 రీల్స్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. క‌నీసం హ‌రీష్ శంక‌ర్ అయినా దీనిపై ఓ క్లారిటీ ఇస్తే బావుండేది.

Tags:    

Similar News