చంద్రబాబు, పవన్ అయినా టికెట్ కొనాలి: నారా భువనేశ్వరి
తలసేమియా లాంటి ప్రాణాంతక రుగ్మతల భారిన పడుతున్న గ్రామీణులను చికిత్స కోసం మేల్కొలుపుతామని భువనేశ్వరి అన్నారు.
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సారథ్యంలో 'ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్' కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యూజికల్ షో ద్వారా వచ్చే డబ్బును ప్రజారోగ్యం, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 28ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న మ్యూజికల్ నైట్ ద్వారా నిధిని సమీకరించనున్నామని వెల్లడించారు. మ్యూజికల్ నైట్ టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయని, టికెట్ కొని డొనేట్ చేయాలని ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. తలసేమియా లాంటి ప్రాణాంతక రుగ్మతల భారిన పడుతున్న గ్రామీణులను చికిత్స కోసం మేల్కొలుపుతామని భువనేశ్వరి అన్నారు.
తమన్ మ్యూజికల్ నైట్ కి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా, ఆయన కార్యక్రమానికి విచ్చేసేందుకు ఒప్పుకున్నారు. పవన్ కల్యాణ్ గారిని ఆహ్వానిస్తాం. ఎవరు వచ్చినా బుక్ మై షోలో టికెట్ కొనుక్కుని రావాల్సిందే. మంచి పని కోసం డొనేషన్ ఇవ్వాల్సిందే. థియేటర్ లో సీట్లు అయిపోయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కోసం ప్రత్యేకించి టేబుల్ ఏర్పాటు చేస్తాం. వారు కుటుంబ సమేతంగా విచ్చేసి షో వీక్షించాలని అన్నారు.
ఈ కీలకమైన కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారిని ఆహ్వానించారా? అని నారా భువనేశ్వరిని ప్రశ్నించగా.. ఎవరైనా కార్యక్రమానికి రావొచ్చని డొనేట్ చేసి, టికెట్ కొనుక్కుని రావాలని అన్నారు. షో కోసం ప్రజలు సెలబ్రిటీలు ఎవరు వచ్చినా, బాలకృష్ణ గారు వచ్చినా టికెట్ కొనుక్కుని రావాల్సిందేనని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
50 మంది టీమ్ తో భారీ కార్యక్రమం చేస్తున్నామని థమన్ ఈ వేదికపై వెల్లడించారు. నా లైఫ్ లో బిగ్గెస్ట్ కాన్సెర్ట్ చేస్తున్నాను అని థమన్ అన్నారు.
తలసేమియా అనేది జెనెటికల్ బ్లడ్ డిజార్డర్.. అది వైద్యం లేనిది.. రక్త మార్పిడి చేయాలి అని భువనేశ్వరి వెల్లడించారు. ''మేం సంజీవని క్లినిక్స్ ఓపెన్ చేసాం. సంజీవని ఆరోగ్య రథంలో అన్ని రకాల టెస్టులకు సహకరించే టూల్స్ ఉంటాయి. వైద్య సదుపాయం లేని రూరల్ ఏరియాలకు మా డాక్టర్లు, నర్సులు వెళతారు. తలసేమియా , క్యాన్సర్ సహా పెద్ద రుగ్మతల గురించి ప్రజల్లో అవేర్ నెస్ పెంచుతారు.. అని తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్:
ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనండి. టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి. ఈ షో టికెట్లపై మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగిస్తామని అన్నారు. విద్య, ఆరోగ్యం, బ్లడ్ బ్యాంక్ సేవలతో మేం ముందుకు వెళుతున్నామని తెలిపారు. మ్యూజికల్ నైట్ కి సహకరిస్తున్న సంగీత దర్శకుడు థమన్ కి భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.