రిహానా (X) టేలర్ స్విఫ్ట్: అంబానీ పెళ్లిని మించేలా అదానీ పెళ్లి
ఇప్పుడు అంబానీ పెళ్లి వేడుకల్ని మించేలా గౌతమ్ అంబానీ తన కుమారుడి పెళ్లిని ప్లాన్ చేసారని సమాచారం.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ పెళ్లిలో పాప్‌స్టార్ రిహానా సహా పలువురు అంతర్జాతీయ గాయనీగాయకులు తమ అద్బుతమైన ప్రదర్శనలతో కట్టి పడేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు సాగిన ప్రీవెడ్డింగ్ వేడుకలు సహా అనంత్ అంబానీ పెళ్లి కోసం ఏకంగా 5000 కోట్లు ఖర్చు చేసారని కథనాలొచ్చాయి. ఇప్పుడు అంబానీ పెళ్లి వేడుకల్ని మించేలా గౌతమ్ అంబానీ తన కుమారుడి పెళ్లిని ప్లాన్ చేసారని సమాచారం. అంబానీ పెళ్లి తరహాలోనే ప్రపంచ స్థాయి పాప్ గాయకులు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు ఈ వివాహంలో సందడి చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు అనంత్ అంబానీ పెళ్లిలో అంతర్జాతీయ పాప్ గాయని రిహానా సందడి చేసిన సంగతి తెలిసిందే. తన పెర్ఫామెన్స్ కోసం ఏకంగా రూ.80కోట్లు వసూలు చేసిందని కథనాలొచ్చాయి. ఇప్పుడు మరో భారతీయ కుబేరుడు, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ - దివా షాల పెళ్లి వేడుక ప్రపంచ కార్పొరెట్ దిగ్గజాలు, వరల్డ్ క్లాస్ తారల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుందని సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత భారీ క్రేజ్ ఉన్న పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ మొదటిసారిగా భారతదేశంలో ప్రదర్శన ఇవ్వడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గాయని టేలర్ స్విఫ్ట్ బృందం ప్రస్తుతం అదానీ కుటుంబంతో చర్చలు జరుపుతోంది. అయితే ఇంకా అధికారికంగా దీనిని ధృవీకరించాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిసింది.
టేలర్ స్విఫ్ట్ భారతదేశంలో లైవ్ షోలో పాల్గొనాలని పెద్ద సంఖ్యలో అభిమానులు కోరుకుంటున్నారు. అది అదానీ ఇంట పెళ్లి వేడుకతో నెరవేరుతుందని కూడా భావిస్తున్నారు. జీత్ అదానీ-దివా షా మార్చి 2023లో అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. వివాహం ఈ సంవత్సరం చివర్లో జరుగుతుందని భావిస్తున్నారు.
భారతదేశంలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్విఫ్ట్ ఇక్కడ ఎప్పుడూ ప్రదర్శన ఇవ్వలేదు. టేలర్ స్విఫ్ట్ ఇటీవల ముగించిన `ఎరాస్ టూర్` సరిహద్దులను దాటి ఆకట్టుకుంది. ఈ పర్యటనలో సింగపూర్, జపాన్‌లలో మాత్రమే ప్రదర్శనలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. స్విఫ్ట్ గతంలో భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని చాటుకుంది. మన సంగీతం, నృత్యం ప్రేక్షకులతో లోతుగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నానని పేర్కొంది.
టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ బిల్‌బోర్డ్ ప్రకారం.. డిసెంబర్ 2024లో ప్రదర్శనలు ముగిసే సమయానికి 2 బిలియన్ల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. పాప్ సంచలనం స్విఫ్ట్ ఆ సంవత్సరం బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో ఆధిపత్యం చెలాయించింది. `టాప్ ఆర్టిస్ట్` పురస్కారం సహా 10 ట్రోఫీలను గెలుచుకుంది.