సోనూసూద్ ఆస్తి విలువ ఎంత‌.. అంత ప‌న్ను ఎగ్గొట్టాడా?

Update: 2021-09-21 14:30 GMT
రెండు ద‌శాబ్ధాలుగా తెలుగు-త‌మిళం-హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏల్తున్నాడు సోనూసూద్. విల‌న్ గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అత‌డు న‌టించాడు. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రు విల‌న్లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఉన్నా సోనూసూద్ ప్ర‌త్యేక‌తే వేరు. న‌టుడిగా అసాధార‌ణ ప్ర‌తిభావంతుడిగా నిరూపించుకున్న సోనూసూద్ కి తెలుగునాట అత‌డు.. అరుంధ‌తి చిత్రాల‌తో బ‌ల‌మైన ఫౌండేష‌న్ ప‌డింది. త‌మిళం-హిందీలోనూ గొప్ప సినిమాల్లో అత‌డు న‌టించి త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. అత‌డు త‌న కెరీర్ జ‌ర్నీలో ఒక్కో సినిమాకి కోట్ల‌లో పారితోషికం తీసుకుంటున్నాడు. ప‌లు క‌మర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టించి ఆర్జించాడు. తాజా స‌మాచారం మేర‌కు... సోనూ సూద్ నికర విలువ దాదాపు 140 కోట్లు ఉంటుంద‌ని అంచనా.

సోనూకి ముంబైలో ఖ‌రీదైన భవంతులు ఉన్నాయి. సోనూసూద్ కుటుంబానికి 20కోట్ల విలువ చేసే సొంత ఇల్లు ఉంది. అంతేకాక అతను ముంబై అంధేరిలో 2600 చదరపు అడుగుల విలాసవంతమైన నాలుగు పడకగదుల హాల్ అపార్ట్ మెంట్ ను కలిగి ఉన్నాడు. క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సుల్లోనూ అత‌డి పెట్టుబ‌డులు ఉన్నాయి. ల‌గ్జ‌రీ కార్లు అస్సెట్స్ ఉన్నాయి.  పోర్స్చే పనామెరా కార్ కు  అత‌డు గర్వించదగిన యజమాని కూడా. ఇది అతని అత్యంత ఖరీదైన ఆస్తులలో ఒకటి. ఈ కారు ధర రూ .1.8 నుంచి 2 కోట్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు.  వైట్ మెర్సిడెస్ బెంజ్ ML- క్లాస్ కార్ ని క‌లిగి ఉన్నాడు. అతను తన ప్రొడక్షన్ హౌస్ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ను 2016 లో ప్రారంభించాడు. 17 మిలియన్లు పెట్టుబడి పెట్టాడు.

సోనూ ద‌క్షిణాదిన తమిళ సినిమాతో అరంగేట్రం చేసాడు. కాళ్లజగరంద్ అనే చిత్రంలో న‌టించాక‌ అనేక త‌మిళ చిత్రాలను చేసాడు. ఆ తర్వాత నెంజినిలే- హ్యాండ్స్ అప్ !- జులాయి- ఏక్ నిరంజన్- సంధిత వేలై త‌దిత‌ర చిత్రాల్లో న‌టించాడు. దబాంగ్ - విష్ణువర్ధన- బుద్ధా ... హోగా తేరా బాప్- శక్తి- షూటౌట్ ఎట్ వడాలా వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా న‌టించాడు.

ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య‌లో అత‌డు విల‌న్ గా క‌నిపిస్తారు. అలాగే సుందర్ సి `మ‌ద‌ గజ రాజా`లో న‌టిస్తున్నాడు. తమిళరసన్ అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తున్నాడు.  అక్షయ్ కుమార్ - మానుషి చిల్లర్ నటించిన పృథ్వీరాజ్ లో కూడా అతను న‌టిస్తున్నారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. ఒక్కో సినిమాకి 2-3 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్న సోనూసూద్ కెరీర్ లో 60 పైగా చిత్రాల్లో న‌టించాడు.  మ‌రో ద‌శాబ్ధం పాటు అత‌డికి ఎదురే లేదు. ఈ ద‌శాబ్ధంలో మ‌రో 30 సినిమాల్లో న‌టించే అవ‌కాశం ఉంది.

క‌రోనా క్రైసిస్ క‌ష్ట కాలంలో లాక్ డౌన్ స‌న్నివేశంలో అత‌డు వ‌ల‌స కార్మికుల పాలిట దేవుడ‌య్యారు. స‌డెన్ గా రియ‌ల్ హీరో అయ్యాడు. వెండితెర విల‌న్ ని దేవుడిగా ఆరాధించారు. ఆ క్ర‌మంలోనే అత‌డికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎదుర‌య్యారు. ఇటీవ‌లే ఐటీ దాడులు ఇందులో భాగం. అయితే సోనూసూద్ 250 కోట్ల ఆస్తుల‌ను క‌లిగి ఉన్నాడ‌ని ప్ర‌చార‌మైంది. ప‌న్ను చెల్లింపుల‌కు స‌రైన‌ వివ‌రాలు లేవ‌ని క‌రోనా స‌మ‌యంలో 20కోట్ల‌ను అత‌డు వివిధ మార్గాల్లో నిధి రూపంలో సేక‌రించి 1.9కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశాడ‌ని అభియోగాలు మోప‌బ‌డ్డాయి. మ‌రి వాటికి సోనూసూద్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News