మ‌హేష్‌ కి 100కోట్ల షేర్ ఇస్తాడా?

Update: 2018-07-27 04:16 GMT
ప్ర‌భాస్ - రామ్‌ చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్ - నాగార్జున‌ - కార్తీ వంటి స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేశాడు వంశీ పైడిప‌ల్లి. మున్నా - ఎవ‌డు - బృందావ‌నం - ఊపిరి చిత్రాల‌తో టెక్నికాలిటీస్ తెలిసిన‌ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ క్ర‌మంలోనే మ‌హేష్ అత‌డు వినిపించిన స్క్రిప్టును ఓకే చేశాడు. అయితే ఆ సినిమా టేకాఫ్ అయ్యేందుకు చాలానే స‌మ‌యం వేచి చూడాల్సొచ్చింది. వంశీ దాదాపు మ‌హేష్ కోసం రెండేళ్లు వేచి చూశాడు. ఎట్ట‌కేల‌కు అది ఫ‌లించింది. ప్ర‌స్తుతం మ‌హేష్ 25 ఆన్ సెట్స్ ఉంది. కొన్ని బ్లాక్‌ బ‌స్ట‌ర్లు తీసిన వంశీకి మ‌రో బ్లాక్‌ బ‌స్ట‌ర్ ప‌డాల్సిన సంద‌ర్భం ఉంద‌నే చెప్పాలి. ఇక్క‌డ ఏ సినిమాకి ఆ సినిమాయే డిసైడ్ చేస్తోంది. మార్కెట్‌ ని ప్ర‌భావితం చేసేది హిట్టు మాత్ర‌మే కాబ‌ట్టి ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అయినా నిరూపించుకోవాల్సిన స‌న్నివేశ‌మే ఉంది.

వంశీ ఆరంభంలో తెర‌కెక్కించిన‌ ఎవ‌డు - బృందావ‌నం లాంటి చిత్రాలు సేఫ్ గేమ్ సినిమాలు. ఊపిరితో కాస్తంత కొత్త‌ద‌నం చూపిస్తూనే తెలుగుద‌నం - సెంటిమెంటును రంగ‌రించే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస‌య్యాడు వంశీ. ఇప్పుడు రైతు స‌మ‌స్య‌లు - రైతు బాంధ‌వుడు - విలేజీ నేప‌థ్యం అంటూ నేటివిటీ స్టోరీతో బ‌రిలో దిగాడు. మ‌హేష్‌- న‌రేష్‌ ల‌ను స్నేహితులుగా మార్చి లైఫ్‌ ని లైవ్‌ లో చూపిస్తాడట‌. అయితే అత‌డు ఏం చేసిన అల్టిమేట్‌ గా మాస్ ఆడియెన్‌ కి న‌చ్చాలి. కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ల‌కు క‌దిలొచ్చే సినిమాని ఇవ్వాలి. `భ‌ర‌త్ అనే నేను` లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్‌ పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. రెగ్యుల‌ర్ చిత్రాల్లో అత‌డు న‌టించ‌డు అన్న కొత్త‌ ఇమేజ్ వ‌చ్చింది కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే సినిమాని ఆద్యంతం కొత్త‌ద‌నంతో - ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ప‌దేళ్ల కెరీర్‌ లో కేవ‌లం నాలుగైదు సినిమాలే తీసిన వంశీ కెరీర్ మునుముందు జోరందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం. హ్యాపి బ‌ర్త్‌ డే టు వంశీ పైడిప‌ల్లి.
Tags:    

Similar News