సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సిల్వర్ జూబ్లీగా రూపొందిన చిత్రం ''మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు - అశ్వనీదత్ - పీవీపీ కలిసి నిర్మించారు. జర్నీ ఆఫ్ రిషి.. మహర్షి అంటూ మహేష్ ను మూడు డిఫరెంట్ షేడ్స్ లో చూపించాడు వంశీ. సందేశాత్మక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటికి మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ మహేష్ అభిమానులు మాత్రం 'మహర్షి' రిజల్ట్ పట్ల హ్యాపీ అవ్వలేదు. ఏదో సినిమా ఎక్సపెక్ట్ చేస్తే రాడ్ సినిమా ఇచ్చాడని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. వంశీతో మరో సినిమా చేయొద్దని సోషల్ మీడియా వేదికగా మహేష్ ను వేడుకున్నారు. అయితే అప్పుడు ట్రోల్ చేసిన అదే నోళ్లు ఇప్పుడు వంశీ పైడిపల్లిని గ్రేట్ డైరెక్టర్ అంటూ తెగ పొగుడుతున్నారు.
ఎందుకంటే కేంద్రం ప్రకటించిన 67వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్-2019లో ''మహర్షి'' సినిమా 3 అవార్డ్స్ సాధించింది. 'ఉత్తమ వినోదాత్మక చిత్రం' - 'ఉత్తమ కొరియోగ్రఫీ' (రాజు సుందరం) - 'ఉత్తమ నిర్మాణ సంస్థ' కేటగిరీలలో అవార్డ్స్ కి ఎంపికైంది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా 'మహర్షి' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సైతం వ్వంశీ పైడిపల్లిని అభినందిస్తూ తన అభిమాన హీరోకు మైలురాయి సినిమా ఇచ్చినందుకు థాంక్స్ అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. మహేష్ తో ఇంకో సినిమా ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఇక మహేష్ సైతం వంశీని ఆకాశానికి ఎత్తేసాడు. ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారాలు రావడం గౌరవంగా భావిస్తున్నానని.. 'మహర్షి' ఎప్పటికీ స్పెషల్ సినిమా అని.. సామాజిక నేపథ్యానికి సంబంధిత కథను వంశీ పైడిపల్లి వెలుగులోకి తెచ్చినందుకు గర్వంగా ఉందని.. జ్యూరీకి మహర్షి చిత్ర బృందానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు అని ట్వీట్ చేసాడు మహేష్.