తెలుగులో వైవిధ్యమైన దర్శకుల్లో వంశీ ఒకరూ.. గోదావరి నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో ఎంతో ప్రత్యేకతను సంపాదించుకున్నాయి. ‘మంచుపల్లకి’ తో దర్శకుడిగా పరిచమైన వంశీ.. ‘సితార’ ‘అన్వేషణ’ వంటి చిత్రాలతో తెలుగులో చెరగని ముద్ర వేశారు. ‘అలాపన’ లాంటి చిత్రాలు ఆయనను క్లాసిక్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా స్వరకల్పనలో వంశీ చిత్రాల్లోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. సంగీతాభిరుచి గల వంశీ కొన్ని చిత్రాలకు స్వయంగా మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేశారు. ఇళయరాజ వంశీ కోసం ప్రత్యేకంగా ట్యూన్లు సిద్ధం చేస్తారని ఇండస్ట్రీలో టాక్. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంతో వంశీ రీ ఎంట్రీ ఇచ్చారు.
‘అనుమానాస్పదం’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చినప్పటికీ.. ఆశించిన పేరు ప్రఖ్యాతలు రాలేదు. అవకాశాలూ రాలేదు. అయితే తాజాగా వంశీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. వంశీ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్స్, ‘అన్వేషణ’ ‘అనుమానాస్పదం’ పెద్ద హిట్లు కొట్టాయి. ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ వంశీతో ఈ కొత్త చిత్రాన్ని తెరకెక్కించున్నట్టు సమాచారం. ఈ చిత్ర నటీనటీల కోసం ప్రస్తుతం వంశీ అన్వేషిస్తున్నాడట. అడవి శేష్ , సత్యదేవ్, విశ్వక్సేన్ వంటి నటుల పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అన్ని అనూకూలిస్తే త్వరలోనే సినిమాను ప్రారంభించి.. ఓటీటీ లేదా థియేటర్లలో రిలీజ్ చేస్తారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. వచ్చే ఏడాది చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చు..