ఒక సితార.. ఒక లేడీస్ టైలర్.. ఒక అన్వేషణ.. ఒక ఏప్రిల్ 1 విడుదల.. వేటికవే అద్భుతమైన సినిమాలు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని మైలురాళ్లు. అలాంటి సినిమాలు చేసిన విలక్షణ దర్శకుడు వంశీ నుంచి గత కొన్నేళ్లలో కొన్ని చెత్త సినిమాలొచ్చాయి. చివరగా వంశీ తీసిన ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ ఆయన అభిమానుల్ని టార్చర్ పెట్టింది. పలుమార్లు వాయిదా పడి ఈ మధ్యే రిలీజైన ఈ సినిమా వంశీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. వంశీ తర్వాతి ప్రాజెక్టుల్ని కూడా డోలాయమాన స్థితిలోకి నెట్టింది. ఇక మళ్లీ వంశీ నుంచి ఇంకో సినిమా రావడం అనుమానమే అనుకుంటున్నారు జనాలు. ఐతే వంశీ మాత్రం తాను మళ్లీ సినిమాలు చేస్తానంటున్నారు. ఇంతకుముందు అనుకున్నట్లే లేడీస్ టైలర్ సీక్వెల్ తెరకెక్కిస్తానని ఘంటాపథంగా చెబుతున్నాడు వంశీ.
‘‘గత రెండేళ్లుగా సినిమా చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఒకటేమో డెడ్ ప్రాజెక్టు అయిపోయింది. ఇంకోటేమో అంతా ఒకే అనుకుని ఇళయరాజాతో పాటలు కూడా చేయించాను. ఈలోగా ఆ సినిమా తీయాల్సిన నిర్మాత చనిపోవడంతో అది ఆగిపోయింది. త్వరలోనే ఒక సినిమా మొదలు కాబోతోంది. అదే లేడీస్ టైలర్ సీక్వెల్. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తారు. ఒకప్పుడు ‘లేడీస్ టైలర్’ విషయంలో ఎలా ప్రయోగం చేశామో.. ఇప్పుడు కూడా అలాగే చేద్దామని ఆలోచన’’ అని వంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం బయో పిక్స్ హవా నడుస్తున్న నేపథ్యంలో.. మీరు అలాంటి సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని వంవీని అడిగితే.. ‘‘ఇళయరాజాది చేయొచ్చు. అద్భుతమైన జీవితం ఆయనది. అలాంటి వ్యక్తి వందేళ్లకోసారే పుడతారని బాలుగారు ఓ సందర్భంలో అన్నారు. అది నిజమే. ఇళయారాజా మామూలు మనిషి కాదు. మేధావి. ఓ సందర్భంలో ఆయన ఆత్మకథ రాస్తానని చెప్పాను. రాస్తే నువ్వే రాద్దువులే అన్నారాయన’’ అని చెప్పాడు.