ట్రైలర్ టాక్: టార్జాన్ తో అఖిల్ బ్యూటి

Update: 2017-03-30 04:26 GMT
అక్కినేని అఖిల్ తో అఖిల్ మూవీలో హీరోయిన్ నటించి టాలీవుడ్ అరంగేట్రం చేసిన బ్యూటీ సాయేషా సైగల్. ఇక్కడ ఎంట్రీ కరెక్ట్ గా లభించలేదు కానీ.. రెండో సినిమాతో బాలీవుడ్ అరంగేట్రంలోనే మంచి హిట్ సాధించింది. శివాయ్ చిత్రంతో బాలీవుడ్ లో సక్సెస్ కొట్టిన ఈ భామ.. ముచ్చటగా మూడో సినిమాతో మూడో భాషలో ఎంట్రీ ఇచ్చేస్తుండడం విశేషం.

జయం రవి హీరోగా నటిస్తున్న వనమగన్ చిత్రం ద్వారా కోలీవీడ్ లో ప్రవేశిస్తోంది సాయేషా. తాజాగా ఈ చిత్రానికి ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటివరకూ కేవలం హీరోపైనే ప్రచారం సాగగా.. ఇప్పుడు హీరోయిన్ తో పాటు మొత్తం స్టోరీని కూడా చెప్పేస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఓ దీవిలో ఉండే ట్రైబల్ గా జయం రవి నటిస్తుండగా.. అనుకోని పరిస్థితుల్లో ఈ టార్జాన్ సాయేషాతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సిటీకి వచ్చినపుడు.. ఇక్కడి పరిస్థితుల కారణంగా బోలెడంత కామెడీని.. సీరియస్ నెస్ ని క్రియేట్ చేశారు.

ఇక ఓ ట్రైబల్ తన కూతురు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ ట్రైలర్ లో జయం రవితో పాటు చెప్పుకోవాల్సిన వ్యక్తి హీరోయిన్ సాయేషా. ఇటు మోడ్రన్ గాళ్ గాను.. మధ్యమధ్యలో పాటల్లో అడవి అందగత్తె గాను మెప్పించింది. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకునేలా రూపొందించడం విశేషం.



Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News