త్వ‌ర‌లో వంగ‌వీటి సీరియ‌ల్: జీవీ

Update: 2017-12-26 09:48 GMT
విల‌న్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు మెప్పించిన జీవీ సుధాక‌ర్ నాయుడు....ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్ హీరోగా రంగా ది దొంగా సినిమాతో మెగాఫోన్ ప‌ట్టిన జీవీ....తాజాగా మ‌రో సీరియల్ తో ముందుకు రాబోతున్నాన‌ని ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన పాత్ర వ‌హించిన దివంగత నేత వంగవీటి రంగా జీవిత చరిత్రను వెబ్ సిరీస్ లో తెర‌కెక్కిస్తాన‌ని జీవీ చెప్పారు. రంగా 29 వ వర్ధంతి సందర్భంగా విజ‌య‌వాడ‌లో ఆయ‌న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జీవీ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. 150 నుంచి 180 ఎపిసోడ్లలో ఆ సీరియల్ ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిపారు. బాహుబలిని త‌ల‌ద‌న్నేలా రంగా జీవిత చరిత్ర్ర ను తీస్తాన‌ని చెప్పారు.

దివంగత దాసరి నారాయ‌ణ రావు గారు తనను రంగా జీవిత చరిత్రను సినిమాగా తీయమ‌ని కోరారని జీవీ చెప్పారు. అయితే, అప్ప‌ట్లో 6 గంటల కథే వచ్చిందని  - అంత త‌క్కువ నిడివిలో రంగా జీవిత క‌థ‌ను వివ‌రించ‌డం కుద‌ర‌ద‌నే ఉద్దేశంతో ఆగిపోయాన‌ని చెప్పారు. వ‌ర్మ తీసిన వంగ‌వీటి సినిమా ఎడిట్ చేసి విడుద‌ల చేశార‌ని - తన సీరియల్ లో రంగాకు సంబంధించి వాస్తవాలు చూపిస్తాన‌ని అన్నారు. రంగా ఘనతను చాటి చెప్పేలా  ఈ సీరియల్ ను తీయ‌బోతున్నాన‌ని అన్నారు. కుల రాజకీయాలు వద్దని ఇప్పుడు పవన్ చెప్ప‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని, ఆ విష‌యాన్ని రంగా ఆనాడే చెప్పార‌ని - ఏ మ‌తాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జీవీ....ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిష‌ని - ఆయ‌నకు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు. ఆయ‌న‌పై కొంద‌రు బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని - త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ వ‌చ్చి వారంద‌రితో మాట్లాడి వారికి త‌గిన స‌మాధాన‌మిస్తాన‌ని ఆవేశ‌పూరితంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ చూస్తుంటే....జీవీ త్వ‌ర‌లో జ‌న‌సేన తీర్థం పుచ్చుకొనే అవ‌కాశాలు కనిపిస్తున్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా, వ‌చ్చే ఏడాది జ‌న‌సేన త‌రపున ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నే యోచ‌న‌లో జీవీ ఉన్న‌ట్లు వారు భావిస్తున్నారు.
Tags:    

Similar News