తెల్ల చీర‌లో వాణీ భోజ‌న్ చ‌మ‌క్కులు!

Update: 2021-10-30 23:30 GMT
కోలీవుడ్ హాట్ బ్యూటీ వాణీ భోజ‌న్ టాలీవుడ్ కి సుప‌రితమే. `ప్రేమ‌`..`మీకు మాత్ర‌మే చెబుతా` లాంటి చిత్రాల్లో న‌టించిన వాణీ భోజ‌న్ అటుపై కెరీర్ ని తెలుగులో స‌క్సెస్ ఫుల్ గా బిల్డ్ చేసుకోలేక‌పోయింది. కేవ‌లం ఈ రెండు సినిమాలతో స‌రిపెట్టుకుని మ‌ళ్లీ మాతృభాష‌కే అంకిత‌మైంది. అక్క‌డ మాత్రం బిజీ హీరోయిన్ గా కెరీర్ సాగిపోతుంది. ప్ర‌స్తుతం త‌మిళంలో దాదాపు 10 సినిమాలు చ‌స్తోంది. అయితే ఇవ‌న్నీ మీడియం బడ్జెట్ చిత్రాలే. చెప్పుకోద‌గ్గ అగ్ర హీరోల చిత్రాల్లో మాత్రం ఇంకా అవ‌కాశాలు రాలేదు. దాదాపు ప‌దేళ్లుగా న‌టిగా కొన‌సాగుతుంది. కానీ అగ్ర హీరోయిన్ల జాబితాలో మాత్రం ఇంకా స్థానం సంపాదించ‌లేదు. ఇది వాణీ భోజ‌న్ కెరీర్ లో తీర‌ని వెలితి.

అయితే వాణీ భోజ‌న్ నిజానికి నేరుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. తొలుత టీవీ ఆర్టిస్ట్ గా ఫేమ‌స్ అయింది. ఆ త‌ర్వాత సినిమాల‌కు ప్ర‌మోట్ అయింది. ఈ ఇంపాక్ట్ వాణీ భోజ‌న్ కెరీర్ పై కొంత ప‌డింది. బుల్లి తెర నుంచి వెండి తెర‌కు ప్ర‌మోట్ అయ్యి.. విజ‌యం సాధించిన వారు కూడా చాలా త‌క్కువ మందే ఉన్నారు. వాళ్ల‌లో వాణీ భోజ‌న్ ఉత్త‌మ స్థానంలోనే ఉంద‌ని చెప్పొచ్చు. అలాగే ఈ 33 ఏళ్ల భామ తొలి నుంచి గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ కి దూరంగా ఉంటూనే వ‌చ్చింది. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతోంది. ఆ ప్ర‌భావం కూడా వాణీ పెద్ద తెర కెరీర్ పై ప‌డింది.

అదంతా స‌రే కానీ.. తాజాగా వాణీ భోజ‌న్ వైట్ శారీలో త‌ళుక్కున మెరిసింది. మ్యాచింగ్ జాకెట్ ని బ్లాక్ అండ్ వైట్ పీస్ లుక్ లో డిజైన్ చేయ‌డం ఆక‌ర్షించింది. కిల‌కిలా న‌వ్వేస్తూ మిర మిరా కెమారాకి ఫోజులిచ్చింది. ఆ చెవుల‌కు భారీ జూకాలు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఎప్పుడూ క‌నిపించే పాత ప‌ద్ద‌తిలోనే మ‌రోసారి ట్రెడీష‌న‌ల్ లుక్ లో క‌నిపించి చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది ఈ బ్యూటీ.


Tags:    

Similar News