ఇంత‌కు మించి విప్ప‌డానికేం ఉంది?

Update: 2019-05-24 05:14 GMT
`ఆహా  క‌ళ్యాణం` ఫేం వాణీ క‌పూర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ముంబైలో టాప్ మోడ‌ల్ గా రాణించిన వాణీక‌పూర్ ను తొలి నుంచి దుర‌దృష్టం వెంటాడుతూనే ఉంది. అందం తో పాటు గ్లామ‌ర్ హొయ‌లు ఉన్నా.. ఏం ప్ర‌యోజ‌నం? య‌శ్ రాజ్ ఫిలింస్ సంస్థ త‌న‌ని బాలీవుడ్ టు టాలీవుడ్ ప‌రిచ‌యం చేసింది. కానీ ఈ అంద‌గ‌త్తెను దుర‌దృష్టం నీడ‌లా వెంటాడింది. ఆరంగేట్రమే డిజాస్ట‌ర్ అయ్యింది. అటుపై తెలుగులో ఆశించిన కెరీర్ ద‌క్క‌లేదు. హిందీలోనూ సోసోనే. దీంతో ఈ అమ్మ‌డు చాలా కాలంగా మోడ‌ళింగ్ అసైన్ మెంట్స్ వ‌ర‌కూ ప‌రిమిత‌మైంది. త‌న‌కు ఉన్న కార్పొరెట్ కాంటాక్ట్స్ తో ఈ బ్యూటీ మోడ‌లింగ్ లో రాణిస్తోంది.

అయితే ఎవ్వెరి డాగ్ హ్యాజ్ ఏ డే! అన్న చందంగా వాణీకి కూడా మ‌రో ఛాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం య‌శ్ రాజ్ ఫిలింస్ (వైఆర్ ఎఫ్‌) నిర్మిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `సంషేరా`లో అవ‌కాశం అందుకుంది. ప్ర‌స్తుతం  సెట్స్ పై ఉన్న ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్ - సంజ‌య్ ద‌త్ క‌థ‌నాయ‌కులుగా న‌టిస్తున్నారు. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 1800 సంవ‌త్స‌రంలో బ్రిటీష్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడిన ఓ గిరిజ‌న ఉద్య‌మ‌కారుడి క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర ఎలిమెంట్. వాణీ ఈ చిత్రంలో ఓ డ్యాన్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇదేగాక ట్యాలెంటెడ్ సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న చిత్రంలోనూ వాణీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

రీఎంట్రీ ఘ‌నంగానే క‌నిపిస్తోంది కాబ‌ట్టి ఈ ఉత్సాహంలో ఇదిగో ఇలా ఒంటిపై ఒక్కో నూలుపోగును ఇలా జార‌విడుస్తోంది. సారీ!! విప్పేస్తున్న‌ట్టు క‌నిపిస్తున్న ఈ డ్రెస్ పూర్తిగా డిజైన‌ర్ క్రియేటివ్ థాట్ అన్న‌మాట‌. బాట‌మ్ లో డెనిమ్ అలా జారిపోతున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. ఇదో హాట్ అప్పీల్ కి సంబంధించిన డిజైన్ అని అర్థం చేసుకోవాలి. సింపుల్ వైట్ అండ్ బ్లూ కాంబినేష‌న్ టాప్ తో టాప్ లేపేసింది వాణీ. ముంబైలో బెస్ట్ మోడ‌ల్స్ జాబితాని తిర‌గేస్తే వాణీ పేరు ఆ జాబితాలో ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఇన్నాళ్లు కాలం క‌లిసి రాలేదంతే. ఇక‌నైనా ప్ర‌స్తుతం న‌టిస్తున్న రెండు సినిమాల‌తో రీలాంచ్ ఘ‌నంగా ఉంటుందేమో చూడాలి.

    

Tags:    

Similar News