ఈమద్య కాలంలో తమిళ మీడియాతో పాటు తెలుగు మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సినీ సెలబ్రెటీ పేరు వనిత విజయ్ కుమార్. ఈమె మూడవ పెళ్లి చేసుకున్నప్పటి నుండి మీడియాలోనే ఉంటుంది. ఈమె మూడవ వివాహం చేసుకున్న పీటర్ పాల్ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. తన భర్తను పెళ్లి చేసుకుంది అంటూ వనితపై మొదటి కేసును పీటర్ పాల్ మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మరో కేసు ఆమెపై నమోదు అయ్యింది.
ఒక టీవీ ఛానల్ చర్చ కార్యక్రమంలో వనిత మాట్లాడుతూ నటి లక్ష్మీ రామకృష్ణన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. నీకు ఒక్క భర్త ఉన్నట్లయితే నీవు పతివ్రతవా అంటూ ప్రశ్నించింది. నన్ను నా భర్తను వనిత పరువు పోయేలా విమర్శించింది అంటూ లక్ష్మీ రామకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ కూడా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కరోనా సమయంలో పెద్ద ఎత్తున జనాలను పిలిచి వేడుక చేసుకోవడంతో పాటు ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంది అంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మూడు కేసుల గురించి తాజాగా ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వాటిని నేను న్యాయస్థానంలో ఎదుర్కొంటాను అంటూ చెప్పుకొచ్చింది.