వచ్చే జన్మలో పోలీస్‌ ఆఫీసర్‌ని అవుతా - వరలక్ష్మి

Update: 2019-04-28 08:35 GMT
తమిళ ఇండస్ట్రీలో వరలక్ష్మి అంటే చాలా ఫేమస్‌. మనకు అంటే పెద్దగా ఎవ్వరూ గుర్తుపట్టరు కానీ.. విశాల్‌ గాళ్‌ ఫ్రెండ్‌ అంటే తెలుగు ఇండస్ట్రీలో బాగా గుర్తుపడతారు. శరత్‌ కుమార్‌ గారాలపట్టిగా ఇండస్ట్రీకి వచ్చిన వరలక్ష్మీ.. హీరోయిన్‌ గా కెరీర్‌ స్టార్ట్‌ చేసింది. సినిమాల కంటే గాసిప్స్‌ తోనే ఎక్కువుగా సావాసం చేసింది. సినిమాలు అయితే చేసింది కానీ ఆమె అనుకున్న స్టార్‌ డమ్‌ మాత్రం రాలేదు. దీంతో.. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్‌గా మారి 2 సినిమాలో ఐఏఎశ్‌ ఆఫీసర్‌ గా నటించింది.
   
వరలక్ష్మి తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా తనకు నచ్చిన కేరక్టర్‌ మాత్రం పోలీస్‌ ఆఫీసర్‌ కేరక్టరే అని చెప్తోంది వరలక్ష్మి. మరో జన్మంటూ ఉంటే కచ్చితంగా పోలీసు అవ్వాలనుకుంటున్నాను అని ప్రకటించింది. వృత్తిని ఎంతగానో ప్రేమించే తనకు.. విభిన్న పాత్రలు ఇస్తున్న దర్శకులకు ధన్యవాదాలు చెప్పింది. అలాగే ఏ క్యారెక్టర్‌ చేసినా నన్ను అంగీకరిస్తున్న నా అభిమానులకు కూడా కృతఙ్ఞతలు అని పేర్కొంది.

మరోవైపు రాజపార్వై సినిమాలో పోలీస్‌ గెటప్‌ లో ఉన్న వీడియోను వరలక్ష్మి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ముందు కూడా తనకు పోలీస్‌ కేరక్టర్లు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. ప్రజల కోసం అనునిత్యం కష్టపడే పోలీసులు అంటే తనకు ఇష్టమని.. అన్యాయాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని గాడిలో  పెట్టే అసలైన హీరో పోలీసేనని అన్నారు ఆమె. అందుకే పోలీస్‌ అన్నా - ఆ పాత్రలన్నా తనకు ఎంతో ఇష్టం అని ప్రకటించారు.
   
వరలక్ష్మీ పోస్ట్‌ చేసిన వీడియోకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. ఐపీఎస్‌ అనే కాదు ఏ పాత్రలోనైనా మీరు అవలీలగా ఒదిగిపోగలరు. పోలీస్‌ గా.. పక్కా పొలిటిషియన్‌ గా - విలన్‌ గా మెప్పించడంలో మీకు మీరే సాటి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి లేటు వయసులో మంచి పాత్రలతో దూసుకుపోతోంది వరలక్ష్మి.


Tags:    

Similar News