ర‌స‌గుల్ల టైటిల్ తో వ‌ర్మ శిష్యుడు సినిమా!

Update: 2023-02-26 15:00 GMT
స‌మాజంలో జ‌రిగే అంశాల‌పై స్పందించి..అందులో త‌న‌కి కావాల్సిన విష‌యం ఏదైనా ఉంటే దాన్ని  ఎన్ క్యాష్ చేసుకోవడం అన్న‌ది సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ ప్ర‌త్యేక‌త‌. ఈక్ర‌మంలో ఏపీ లో రాజకీయ నాయకుల్ని సైతం ఎన్నోసార్లు ట‌చ్ చేసారు. ర‌క‌ర‌కాల టైటిల్స్ తో వాళ్ల క‌థ‌ల్ని సెటైరిక‌ల్ గా సినిమా రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఇదే త‌ర‌హాలో అప్పుడ‌ప్పుడు త‌న శిష్యుల్ని మార్కెట్ లోకి వ‌ద‌లుతుంటారు.

పాయింట్  ఆస‌క్తిక‌రంగా ఉంటే వ‌ర్మ‌...మ‌రీ అంత స్ట‌ప్ లేక‌పోతే అత‌ని శిష్యుల్ని సీన్ లోకి తెచ్చి సినిమాలు చేస్తుంటారు. తాజాగా `ర‌స‌గుల్ల` అనే టైటిల్ ఫిలిం ఛాంబ‌ర్ లో రిలీజ్ అయిందిట‌. `రుచి గుల్ల` అనేది ఉప‌శీర్ష‌క‌గా వినిపిస్తుంది. ఈ సినిమాకు వ‌ర్మ శిష్యుడు ఒక‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారుట‌.

ఈ సినిమాకి క‌థ‌..క‌థ‌నాలు అందించేది మాత్రం వ‌ర్మ‌నే అట‌. అలాగే ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా వ‌ర్మ‌నే చూస్తురుట‌. కేలం శిష్యుడు ముందుండి అంతా న‌డిపించ‌డ‌మేన‌ని...వెనుకుండి అస‌లు క‌థ న‌డిపించేది మాత్రం వ‌ర్మ అని తెలుస్తోంది.

ఇంత‌కీ ఏంటి ర‌స‌గుల్ల ప్ర‌త్యేక‌త అంటే? ఆ మ‌ధ్య ఓ టీడీపీ నాయ‌కుడుకి   ఈ పేరును వ‌ర్మ పెట్టారు. ఆ నేత ఆహార్యం...రంగు లాంటివి  ఉద్దేశించి ర‌స‌గుల్ల‌లా ఉంటాడ‌ని వ‌ర్మ వ్యాఖ్యానించారు. అది నెట్టింట  ఏ రేంజ్ లో వైర‌ల్ అయిందో తెలిసిందే. ప్ర‌తిగా ఆ నాయ‌కుడు వ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డారు. తాజా ఎపిసోడ్ లో కూడా ఆ నాయ‌కుడు హాట్ టాపిక్ గామారిన సంగ‌తి తెలిసిందే.

ఈ అంశంపైనా వ‌ర్మ ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఆ స‌మ‌యంలోనూ అత‌ని మాన‌సిక స్థితిపై కొన్ని ర‌కాల కామెంట్లు చేసారు. ఇంత‌లోనే ర‌స‌గుల్ల టైటిల్ రిజిస్ర్ట‌ర్ అవ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది. మ‌రి ఈసినిమాలో పాత్ర‌ధారులు ఎవ‌రు? వ‌ర్మ కేటాయించే బ‌డ్జెట్ ఎంత‌?  ర‌స‌గుల్ల‌ని థియేట‌ర్లో రిలీజ్ చేస్తారా?  ఓటీటీలో  లేక యూ ట్యూబ్ లో  రిలీజ్ చేస్తారా? అన్న అంశాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News