కుమారుని విడాకుల పుకార్ల నడుమ సూపర్‌స్టార్ పోస్ట్!
ఇంతకుముందు మెగాస్టార్ సైరాలో నటించిన అమితాబ్, 2024లో ప్రభాస్ `కల్కి 2989 ఏడి`లో అశ్వద్ధామగా నటించారు.
ఇంతకుముందు మెగాస్టార్ సైరాలో నటించిన అమితాబ్, 2024లో ప్రభాస్ `కల్కి 2989 ఏడి`లో అశ్వద్ధామగా నటించారు. ఈ రెండు చిత్రాలతో బిగ్ బికి తెలుగు లోగిళ్లలో మరింత గౌరవం, గుర్తింపు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు కూడా అమితాబ్ నటనను అమితంగా ఇష్టపడుతున్నారు. మరోవైపు అమితాబ్ కుటుంబంపై ఊహించని ఒక విషయంపై ఇప్పుడు తెలుగు లోగిళ్లలోను చర్చ సాగుతోంది. అదేమిటీ అంటే... కొడుకు కోడలు ఒకరి నుంచి ఒకరు విడిపోతున్నారనేది ఆ వార్త.
ఇలాంటి అరుదైన ససమయంలో అమితాబ్ బచ్చన్ X లో ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. X సహా అతడి బ్లాగ్‌లో రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేసే అమితాబ్...నిద్ర గురించి అకారణంగా ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. కుమారుడు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ విడాకుల పుకార్ల మధ్య కొత్త పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారం అర్థరాత్రి అమితాబ్ సోషల్ మీడియాలో ఇలా రాసారు. ``T 5172 - చలే భయ్యా !`` అని రాసారు.
అభిషేక్ బచ్చన్ తదుపరి చిత్రం `ఐ వాంట్ టు టాక్` టీజర్‌ను విడుదల చేసారు. ఇది వైరల్ గా దూసుకెళుతోంది. ఈ టీజర్ కాన్సెప్ట్ అభిషేక్ రియల్ లైఫ్ కి కనెక్టివ్ గా కనిపించడం ఆశ్చర్యపరుస్తోంది. ``మాట్లాడడానికి జీవించే ఒక వ్యక్తి అని మనందరికీ తెలుసు. జీవితం తనపై విసిరిన ఛాలెంజ్ ఎదురుగా ఉన్నా, జీవితంలోని ప్రకాశవంతమైన వైపు ఎల్లప్పుడూ చూసే వ్యక్తి కథను ఇక్కడ చూపిస్తున్నాం`` అని నేపథ్యంలో వినిపిస్తుంది. సవాళ్లలోను జీవించే మీకు తెలిసిన వ్యక్తిని ట్యాగ్ చేయండి! అని ట్వీట్ చేసాడు. అమితాబ్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ, ``ఓహ్ వావ్! గ్రేట్ అభిషేక్.. ఈ ప్రేమను చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నాను`` అని రాసాడు. బిగ్ బితో పాటు పలు చిత్రాలకు పనిచేసిన షూజిత్ సిర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీటిలో పికు, పింక్ (ఇందులో షూజిత్ సిర్కార్ సహ రచయిత), గులాబో సితావోలకు షూజిత్ పని చేసారు.
ఇదిలా ఉండగా విడాకుల పుకార్లపై బచ్చన్ కుటుంబం నోరు మెదపలేదు. ఐశ్వర్య, అభిషేక్ విడాకుల గురించి కొన్ని నెలలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీరికి పెళ్లయి ఇప్పటికి 17 ఏళ్లు. ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ వారసురలు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుటుంబంతో కాకుండా విడిగా అంబానీ పెళ్లికి వెళ్లడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో విడాకుల పుకార్లు ప్రారంభమయ్యాయి. పెళ్లిలో తన కుమార్తెతో కలిసి ఒంటరిగా కనిపించింది. ఒకానొక సందర్భంలో విడాకుల గురించిన పోస్ట్‌ను అభిషేక్ లైక్ చేయడం ద్వారా ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించినా అభి-ఐష్ విడివిడిగా కనిపిస్తున్నారు. ఐష్ స్వయంగా SIIMA అవార్డులకు హాజరైనట్లు కూడా కనిపించింది. ఈ వేడుకలో ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును అందుకుంది. ఆరాధ్య ఆమెను ఉత్సాహపరుస్తుండగా, బచ్చన్ కుటుంబ సభ్యులు ఎవరూ సోషల్ మీడియాలో విజయంపై స్పందించలేదు. ఇది అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది.