ఉస్తాద్ భగత్ సింగ్.. మరో ట్విస్ట్ ఇచ్చారుగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

Update: 2024-10-26 09:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే 30 శాతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత కాలం వాయిదా పడింది. 2025లో మరల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తెరి’ కి రీమేక్ అనే ప్రచారం నడిచింది. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ తీసుకొని హరీష్ శంకర్ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ కి సరిపోయే విధంగా మార్పులు చేసినట్లు టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే తాజాగా రచయిత, దర్శకుడు దశరథ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇది ‘తెరి’ చిత్రానికి రీమేక్ కాదని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సినిమాకి దశరథ్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ నేపథ్యంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండబోతుందని ఆయన తెలియజేశారు. అయితే ‘తెరి’ మూవీకి పవన్ కళ్యాణ్ చిత్రంతో కొంత సారూప్యత ఉండటం వల్ల రీమేక్ అనే ప్రచారం తెరపైకి వచ్చిందని అన్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వలన అందరికి తప్పుగా సమాచారం కమ్యూనికేట్ అయిందని తెలిపారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తిగా పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉంటుందని అన్నారు. ప్రేక్షకులు పవర్ స్టార్ ని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ విజిల్స్ వేసే సీక్వెన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి అని పేర్కొన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. అశుతోష్ రాణా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు.

శ్రీలీల హీరోయిన్ గా చేసింది. 2025 ఆఖరిలో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’, అలాగే ఏఎం రత్నం నిర్మాణంలో సిద్ధం అవుతోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ చేసిన తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News