మహేష్ మేనల్లుడి మూవీ.. రంగంలోకి ఆ సంస్థ..

భారీ అండ్ ఫ్యాన్సీ ధరకు శంకర్ పిక్చర్స్.. హక్కులను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారని తెలిపారు.

Update: 2024-10-26 08:04 GMT

సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఇప్పటికే యంగ్ హీరో అశోక్ గల్లా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం 'హీరో' మూవీతో అడుగుపెట్టిన ఆయన.. తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తన రెండో చిత్రం దేవకీ నందన వాసుదేవతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గుణ 369 సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ అర్జున్ జంధ్యాల.. అశోక్ రెండో మూవీని తెరకెక్కిస్తున్నారు.

దేవకీ నందన వాసుదేవలో అశోక్ గల్లా సరసన కొత్త హీరోయిన్ తెలుగమ్మాయి మానస వారణాసి నటిస్తున్నారు. 2020లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ లో అశోక్, మానస పెయిర్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక ఇతివృత్తాలతో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ లో అశోక్.. విభిన్నమైన పాత్రలో నటించినట్లు.. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న దేవకీ నందన వాసుదేవ మూవీ.. అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మేకర్స్ నవంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో దేవకీ నందన వాసుదేవ ప్రీరిలీజ్ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ దక్కించుకున్నట్లు శనివారం ఉదయం అనౌన్స్ చేశారు.

భారీ అండ్ ఫ్యాన్సీ ధరకు శంకర్ పిక్చర్స్.. హక్కులను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారని తెలిపారు. అయితే మూవీ స్టార్ట్ అయిన నుంచి ప్రేక్షకుల్లో దేవకీ నందన వాసుదేవపై మంచి బజ్ ఉందనే చెప్పాలి. అందుకు ఒక కారణం హీరో అశోక్ గల్లా అయితే మరొక కారణం ప్రశాంత్ వర్మనే. దీంతో ఆడియన్స్ లో ఉన్న బజ్ ను దృష్టిలో పెట్టుకుని, కాన్సెప్ట్ నచ్చి.. శంకర్ పిక్చర్స్ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిందని ఇప్పుడు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా.. సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్ రాశారు. భీమ్స్ సిసరోలియో మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చారు. సినిమాటోగ్రాఫర్లుగా ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ వ్యవహరించారు. మరి దేవకీ నందన వాసుదేవ చిత్రంతో అశోక్ గల్లా ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News