OGలో అకీరా ఉన్నాడా? ఆ వీడియోలో నిజమెంత?

ఆ వీడియోలో ఓ ఫైట్ సీన్ షూట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు సంబంధించిన బిట్ గా క్లియర్ గా తెలుస్తోంది.

Update: 2024-10-26 09:12 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తవ్వగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటం వల్ల హోల్డ్ లోకి వెళ్ళిపోయింది.

రీసెంట్ గా పవన్.. తన చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇచ్చారు. దీంతో మళ్లీ ఆయన అప్ కమింగ్ మూవీల షూటింగ్ లు రీస్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓజీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారట. త్వరలోనే పవన్.. ఓజీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ ఫైట్ సీన్ షూట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు సంబంధించిన బిట్ గా క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఆ కటౌట్ అకీరాదేనని చెబుతున్నారు. పవన్ మ్యానరిజం ను ఇమిటేట్ చేస్తూ ఫైట్ చేస్తుందని కచ్చితంగా పవర్ స్టార్ వారసుడేనని అంటున్నారు. అలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ వీడియోలో ఉన్న అకీరా కాదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. పవన్ పాత సినిమాల్లోని ఒక చిత్రానికి సంబంధించిన వీడియోగా తెలుస్తుందని అంటున్నారు. ఒకవేళ అది అకీరా నందన్ అయితే మాత్రం.. ఓజీ రిజల్ట్ విషయంలో ఇక తిరుగు చూడాల్సిన అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అకీరా కాదో తెలియకపోయినా.. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది.

ఇక కొద్ది రోజుల క్రితం.. అకీరా నందన్ తన పెద్దనాన్న విశ్వంభర మూవీతో డెబ్యూ ఇస్తాడని జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత పవన్ ఓజీ మూవీతోనే సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి కనిపించనున్నారని టాక్ వచ్చింది. పవన్ చిన్నప్పటి రోల్ లో యాక్ట్ చేయనున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అకీరా నటించడం నిజమేనని చెబుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి ఈ విషయంలో నిజమెంత అనేది మాత్రం తెలియదు.

Tags:    

Similar News