జాన్వీ క‌పూర్ ముందే వ‌రుణ్ ధావ‌న్ బ్లో...జా!

Update: 2022-12-21 10:30 GMT
కోవిడ్ ద‌గ్గ‌ర నుంచి బాలీవుడ్ కి స‌రైన స‌క్సెస్ లేని సంగ‌తి తెలిసిందే. చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ  విఫ‌ల‌మే అవుతున్నాయి. భారీ అంచ‌నాల  మ‌ధ్య వ‌చ్చిన సినిమాల‌న్నీ బోల్తా కొడుతున్నాయి.   మూడేళ్ల‌గా ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. దీంతో ప్రేక్ష‌కులే కాదు...స‌హ‌నం కోల్పోయిన హిందీ న‌టులు సైతం బాలీవుడ్ ని తిట్టిపోస్తున్నారు. మ్యాట‌ర్లేని డైరెక్ట‌ర్లు...హీరోలు మ‌న ప‌రిశ్ర‌మ‌లోనే ఉన్నారంటూ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెడుగుడు ఆడేస్తున్నారు కొంద‌రు.

వాళ్ల వ్యాఖ్య‌లు చూస్తుంటే  ఇదంతా ఓర‌క‌మైన ప్ర‌స్టేష‌న్ లానే క‌నిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావన్ ఏకంగా హీరోయిన్ జాన్వీక‌పూర్ ముందే బూతు పురాణం అందుకున్నాడు. అదీ అలాంటి...ఇలాంటి పురాణం కాదండోయ్..ఏకంగా ప్ర‌యివేట్ రూమ్ లో వాడాల్సిన ప‌ద‌జాలాన్నే వాడేసి నెట్టింట దుమారం అయ్యాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో  కోవిడ్ అనంతర కాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్ లో వ‌చ్చిన మార్పులేంటి ? అని వ‌రుణ్ ని ప్ర‌శ్నించ‌గా... ఇప్పుడు సినిమాలకు కంటెంట్ కీలకం. ప్రేక్షకులు మంచి కంటెంట్‌ని మాత్రమే ఆద‌రిస్తున్నారు.  ఇది  స్టార్ హీరోల  అహంకారా నికి B*** J** లాంటిది.  ఇక స్టార్ హీరోల సినిమాలకు పుల్ ఫ్యాక్టర్ అనే రోజులు లేవు. కంటెంట్ మాత్ర‌మే ముందుకు న‌డిపించేది.

ఎవి ప‌డితే అవి తీసేసి జ‌నాల్నిమెప్పించేద్దాం అంటే?  కుద‌ర‌దు అన్నాడు. ఆ స‌మ‌యంలో జాన్వీ క‌పూర్  కూడా ప‌క్క‌నే కూర్చుని ఉంది. వ‌రుణ్ ని ఆ ప్రశ్న అడ‌గ‌గా అత‌ని వైపు తీక్ష‌ణం చూస్తుంది. ఇదే స‌మ‌యంలో వ‌రుణ్ మాట‌ల వేగంలో  'బ్లో...జా..' అనే ప‌దం వాడాడు. దీంతో జాన్వీ ఒక్క‌సారిగా షాక్ అయింది. ఆ త‌ర్వాత రెండు చేతుల‌తో నోరు మూసుకుని సిగ్గు ప‌డింది. జాన్వీ వరుణ్ నుండి ఈ వ్యాఖ్యను  ఏ మాత్రం ఊహించలేదు. ఆ ప‌దం చెవిన ప‌డ‌గానే  చాలా ఇబ్బందిగా ఫీలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News