న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 కు మసాలా ఇంకా సరిపోవడం లేదని భావిస్తున్న నిర్వాహకులు కీలకమైన మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎలిమినేషన్ ఒకవైపు జరుగుతుండగానే వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో కొత్త వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. అందులో భాగంగానే యూత్ హీరో వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇప్పించబోతున్నట్టు తెలిసింది. హ్యాపీ డేస్ తో పరిచయమైన వరుణ్ సందేశ్ తర్వాత కొత్త బంగారు లోకం లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా ఒకే తరహా పాత్రలకు కట్టుబడి పోవడంతో ఎక్కువకాలం నిలవలేకపోయాడు
ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ గా ఉన్న వరుణ్ సందేశ్ కు యూత్ లో ఇప్పటికీ గుర్తింపు ఉంది. సినిమాలు లేకపోయినా తనను ఐడెంటిఫై చేస్తారు కనక రైట్ ఛాయస్ గా ఫీల్ అయ్యి తీసుకువచ్చే ఆలోచన చేసినట్టు కనిపిస్తోంది. ఇది నిజమో కాదో మరో పది రోజుల్లో తేలిపోనుంది.
రేటింగ్స్ విషయంలో బాగానే నెట్టుకొస్తున్న బిగ్ బాస్ 2 తమిళ హిందీ లాంటి ఇతర భాషలతో పోలిస్తే వివాదాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. దానికి తోడు ఎంపిక చేసిన పార్టిసిపెంట్స్ విషయంలోనూ పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ లాంటి గుర్తింపు ఉన్న యూత్ హీరోలు సందడి చేస్తే ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు ఇలాగే నవదీప్ సడన్ గా వచ్చి చేసిన రచ్చ అంత ఇంతా కాదు. అది బాగా హెల్ప్ అయ్యింది కూడా. అందుకే వరుణ్ సందేశ్ ని అదే తరహాలో హౌస్ లోకి తీసుకొచ్చి ప్లస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో ఎలాగూ కొత్తగా విడుదల అవుతున్న సినిమా యూనిట్లు వచ్చి అల్లరిని జోడిస్తాయి కాబట్టి ఇలాంటి వైల్డ్ కార్డు ఎంట్రీలతో ఫైనల్ గా షోని జనరంజకంగా మార్చే ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. ముందు ముందు ఇంకెవరెవరు రానున్నారు అనే దాన్ని బట్టి బిగ్ బాస్ 2 మీద ఆసక్తి పెరగడం ఆధారపడి ఉంటుంది.