అబ్బే.. ఆ సినిమాలు చేయట్లేదు

Update: 2018-01-06 10:57 GMT
ఫిదా సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగా హీరో వరున్ తేజ్ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ హీరో అనిపించుకున్నాడు. అయితే నెక్స్ట్ కూడా అదే తరహాలో బ్లక్ బస్టర్ హిట్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. తొలిప్రేమ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ మెగా హీరో చాలా స్పీడ్ గా కథలను ఒకే చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని వరుణ్ ఒక ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. గత కొంత కాలంగా వెంకీతో అలాగే రానాతో మల్టి స్టారర్ సినిమానుజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వెంకటేష్ తో అనిల్ రావిపూడి F2 అనే సినిమాని చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఆ సినిమాలో మరో హీరోగా వరుణ్ సెలెక్ట్ అయినట్టు టాక్ వచ్చింది.

అంతే కాకుండా రానా చేయబోయే ఒక హిందీ మూవీ రీమేక్ లో స్పెషల్ క్యారెక్టర్ కోసం ఆ సినిమాను తెరకెక్కించే మలయాళ దర్శకుడు వరుణ్ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫైనల్ గా వరుణ్ క్లారిటీ ఇవ్వడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ప్రస్తుతం తొలిప్రేమను మాత్రమే చేస్తున్నాను ఇంకెలాంటి కథలను ఒకే చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమాను ఒప్పుకుంటే ముందు నేనే చెబుతాను అంటూ వరుణ్ తేజ్ కూల్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు.      
 
Tags:    

Similar News