కొంతమంది హీరోలు.. చాలా టాలెంట్ ఉన్న హీరోల్లా కనిపిస్తారు.. వారి యాక్టింగ్ అమోఘంగా ఉంటుంది. ఫ్యాన్సు కూడా వారిని తెగ పొగిడేస్తారు. నారా రోహిత్ - శర్వానంద్ - అజయ్ వీళ్లందరూ ఒకటే జానర్ 'విలక్షణ నటులే. అయితే ఈ మంచి నటులకు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు మాత్రం పడట్లేదు. నాని ఒక్కడే ఈ మధ్యనే బయటకొచ్చాడు కాని.. మిగిలినవారు ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే వరుణ్ తేజ్ కూడా ఇదే గ్రూపులో జాయిన్ అవుతున్నాడని మెగా క్యాంపు కాస్త ఖంగారుపడుతోందట.
సినిమా సూపరహో.. అంటూ 'ముకుంద' రిలీజ్ అయినప్పుడు చాలామంది బాకా ఊదేశారు. కాని కలెక్షన్ల పరంగా అట్టర్ ఫ్లాప్. సినిమా పరంగానూ అట్టర్ ఫ్లాపేలే. అసలు కథేముంది ఆ సినిమాలో? కట్ చేస్తే.. ఇప్పుడు 'కంచె'. సూపర్ కాన్సెప్టు అని అందరూ విపరీతంగా పొగిడేశారు కాని.. బాక్సాఫీస్ దగ్గర నిలబడటానికి కావల్సినంత ఎమోషన్ లేదని అందరికీ లేటుగానే అర్ధమైంది. ఆ సినిమాతో కూడా పేరు వచ్చిందేమో కాని.. స్టార్డమ్ మాత్రం రాలేదు. అందుకే వరుణ్ తేజ్ గురించి కాస్త కంగారుపడుతున్నారట నాగబాబు. ముందులో లోఫర్ సినిమాలో ఈ డైలాగ్ తేసేయండి.. ఆ డైలాగ్ తీసేయండి.. లోఫర్ అనే టైటిల్ మార్చండి.. అంటూ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయన కూడా చాలా హడావుడి చేశారట. కాని ఒక్కసారి కంచె అవుట్ పుట్ చూశాక.. ఆయన తన పందా మార్చుకున్నారని తెలుస్తోంది.
మొన్నటివరకు పూరి జగన్ ను సగం సగం మాత్రమే నమ్మారు. నిజానికి హిట్టు ఇవలేకపోయినా.. ఒక హీరో తాలూకు మాస్ ఇమేజ్ ను మైండ్ బ్లోయింగ్ గా మార్చేసే దర్శకుడు పూరి. పోకిరి లేకపోతే మహేష్ బాడీ లాంగ్వేజ్ మారుండదు.. బుజ్జిగాడు పడకపోతే ప్రభాస్ మాస్ కు సెట్టయ్యేవాడు కాదు.. దేశముదురు లేకపోతే బన్నీ డైలాగ్ డెలివరీలో యాస బయటకొచ్చేది కాదు. అందుకే ఇప్పుడు టోటల్ సినిమా తాలూకు డెసిషన్లన్నీ పూరి చేతిలోనే పెట్టేశారట. మనోడు ఏం ప్లాన్ చేస్తే అదే అందరూ ఫాలో అయిపోతున్నారట. ఒకవేళ లోఫర్ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టకపోయినా కూడా.. పైన చెప్పిన విలక్షణ నటుల గ్రూపులో పడిపోకుండా.. మనోడి జాతకం మారిపోయి చకచకా కమర్షియల్ స్టార్ మాత్రం అవ్వడం ఖాయం ఇప్పుడు మెగా క్యాంపుకు జ్ఞాన బల్బు వెలిగిందోచ్. లెటజ్ సీ.. ఏమవుతుందో!!