క్రిష్ డైరెక్షన్ లో మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన కంచె.. లాభాల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలో సత్తా చాటుతోంది. క్రిష్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడంతోపాటు.. కలెక్షన్లలోనూ కాసుల వర్షం కురిపిస్తోంది.
అమెరికాలో కంచె ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను దాటింది. రెండో వారం చివరకు 5,02,121 డాలర్ల కలెక్షన్లు రాబట్టింది కంచె. రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్లాట్ గా తీసుకుని, ఓ గ్రామానికి లింక్ చేసి క్రిష్ తీసిన మూవీకి.. బోర్డర్ బయట కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. అమెరికా మార్కెట్ లోనే కాదు.. మొత్తంగా ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసినవారందరూ.. ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్ ల జంట కంచెకు ప్రధాన ఆకర్షణగా చెప్పాలి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉండడంతోపాటు.. విభిన్న నేపథ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మరోవారం పాటు సరైన మూవీ ఏదీ రిలీజ్ లేకపోవడంతో.. కంచె భారీ లాభాలనే గడించడం ఖాయంగా చెప్పచ్చు.