మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'గని' ఏప్రిల్ 8న భారీ అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 40-50 కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్ కెరీర్ లో ఇదే తొలి భారీ బడ్జెట్ చితంగా నిర్మాణం జరిగింది. సినిమా కోసం ఎంతగానో శ్రమించారు. వరుణ్ ప్రత్యేకంగా కఠోరమైన బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. బాడీని సిక్స్ ప్యాక్ లుక్ లో మార్చడానికి ఎంతో శ్రమించారు. మొత్తంగా ఈ సినిమా కోసం వరుణ్ చాలా సమయాన్నే వెచ్చించాల్సి వచ్చింది.
ఇక ఇదే సినిమాతో అల్లు అరవింద్ పెద్దకుమారుడు బాబి కూడా నిర్మాతగా పరిచయం అయ్యారు. సినిమా కథ ఎంతగానో నచ్చడంతో బాబి చాలా కాన్ఫిడెంట్ గా చిత్రాన్ని నిర్మించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిదో తెలిసిందే. తొలి షోతోనే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సినిమాపై నెగిటివిటీ మరింత స్ప్రెడ్ అయింది. వరుణ్ కెరీర్ లో నే భారీ వసూళ్ల చిత్రంగాను నిలుస్తుందని రిలీజ్ కి ముందు అంచనాలుండేవా.
కానీ వాటిని సహా మెగా అభిమానుల అంచనాల్ని తారుమారు చేసింది. తాజాగా 'గని' ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈనెల 22న ఆహా ఓటీటీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ చాలా వినూత్నంగా జరుగుంది.
నిర్మాతల కట్ వెర్షన్ ని ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్ రిలీజ్ లో తొలగించిన 10 నిమిషాల పుటేజీని ఆహా వెర్షన్ కి జోడీంచారు. అలాగే విభిన్నమైన స్ర్కీన్ ప్లే తో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పనులన్నింటిని చిత్ర నిర్మాతలే దగ్గరుండి పూర్తిచేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి పనులు ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడో... అంతను అందుబాటులో లేకపోతే అనుభవజ్ఞులైన దర్శకుల్నో..రచయితల్నో రంగంలోకి దించుతారు. కానీ 'గని' విషయంలో నేరుగా నిర్మాతలే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నిర్మాతలుగా తమ అనుభవానిన మొత్తాన్ని రంగరించి నిర్మాతల వెర్షన్ 'గని'ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా నిర్మాతల వెర్షన్ రిలీజ్ చేయడం ఓటీటీ చరిత్రలోనే ఇదే మొదటి సారి కావడం విశేషం.
ఇప్పటివరకూ ఏ సినిమా ఓటీటీ రిలీజ్ కి ఇలా జరగలేదు. ఆరకంగా 'గని' నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇందులో వరుణ్ కి జోడీగా సాయి మంజ్రేకర్ నటించింది. ఉపేంద్ర..సునీల్ శెట్టి..జగపతి బాబు..నదియా లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు.